Twisha Sharma | భోపాల్‌లో తెలుగు నటి అనుమానాస్పద మృతి.. ట్విషా శర్మ కథ విషాదాంతం
Twisha Sharma | తెలుగు నటి ట్విషా శర్మ భోపాల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఎంబీఏ చదివిన ఆమె మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ రంగాల్లో పనిచేయడంతో పాటు తెలుగు సినిమాల్లోనూ నటించింది. మాజీ మిస్ పూణేగా గుర్తింపు పొందిన ట్విషా యోగా ట్రైనర్‌గానూ సేవలందించింది.
Entertainment | Published On May 18, 2026, 5.18 pm IST
Twisha Sharma | తెలుగు నటి ట్విషా శర్మ భోపాల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఎంబీఏ చదివిన ఆమె మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ రంగాల్లో పనిచేయడంతో పాటు తెలుగు సినిమాల్లోనూ నటించింది. మాజీ మిస్ పూణేగా గుర్తింపు పొందిన ట్విషా యోగా ట్రైనర్‌గానూ సేవలందించింది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ప్రేమ వివాహంగా మారినా.. పెళ్లైన కొద్ది నెలల్లోనే ఆమె జీవితం విషాదంగా ముగియడం కలకలం రేపుతోంది. మరణానికి ముందు తల్లికి, స్నేహితులకు పంపిన భావోద్వేగ సందేశాలు ఇప్పుడు కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ట్విషా నిజంగానే మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందా? లేక ఆమె మరణం వెనుక మరేదైనా కారణం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు సినిమాలో..
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ట్విషా శర్మ వివాహానికి ముందు ఢిల్లీలో చాలా సంవత్సరాలు పనిచేసింది. ఆమె తెలుగు చిత్రం ‘ముగ్గురు మొనగాళ్లు’లో కూడా నటించింది. అనంతరం ముంబయికి చెందిన ఓ సంస్థలో ఉద్యోగం చేసింది. మార్కెటింగ్, కమ్యూనికేషన్స్, క్రియేటివ్ రంగాల్లో ఆమె కెరీర్ కొనసాగింది. లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం మార్కెటింగ్‌తో పాటు నటన, ఫిల్మ్‌మేకింగ్‌పై ఆసక్తి ఉన్న డైనమిక్ ప్రొఫెషనల్‌గా ట్విషా తనను తాను పరిచయం చేసుకుంది. ముంబయికి చెందిన ‘ఫ్లేవర్ పాట్ ఫుడ్స్’లో మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేసిన ఆమె, తర్వాత జర్మన్ అకాడమీ ఆఫ్ డిజిటల్ ఎడ్యుకేషన్‌లో కమ్యూనికేషన్స్, ఆన్‌బోర్డింగ్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహించింది. ట్విషా సర్టిఫైడ్ యోగా ఇన్‌స్ట్రక్టర్‌గా ఉండటంతో పాటు విపాసన ధ్యానం సైతం నేర్చుకుంది.
జీవితం నరకంగా మారిందని..
మరణానికి ముందు ట్విషా తన తల్లికి, స్నేహితులకు పంపిన వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు వెలుగులోకి వచ్చాయి. ఇందులో వైవాహిక జీవితం తనను తీవ్రంగా మానసికంగా కుంగదీస్తోందని ఆమె పేర్కొంది. “నన్నెందుకు ఇక్కడికి పంపించావు? అతను నాతో మాట్లాడటం కూడా లేదు” అని తల్లికి పంపిన సందేశంలో ట్విషా ఆవేదన వ్యక్తం చేసింది. మరో సందేశంలో “నా జీవితం నరకంగా మారిపోయింది మమ్మీ” అని రాసుకొచ్చింది. స్నేహితురాలితో జరిగిన చాట్‌లో ఇంట్లో ఖాళీగా ఉండటం వల్ల ఆందోళనకు గురవుతున్నానని, జీవితంలో ఏదైనా చేయాలని అనుకుంటున్నానని ట్విషా తెలిపినట్లు సమాచారం.
జీవితం ఇంటి నరకంగా మారిందని..
ట్విషా మృతి తర్వాత ఆమె కుటుంబ సభ్యులు భోపాల్‌లో సీఎం నివాసం ఎదుట నిరసనకు దిగారు. కేసుపై నిష్పక్షపాత విచారణ జరపాలని, ఎయిమ్స్ ఢిల్లీలో రెండోసారి పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం అధికారులు చుట్టూ తిరగాల్సి వస్తోందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ట్విషా తండ్రి నవనిధి శర్మ, బంధువు ఆశిష్ శర్మ మాట్లాడుతూ మొదట ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారని ఆరోపించారు. కట్న వేధింపుల ఆరోపణలపై పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేశారు. ట్విషా భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాలా సింగ్‌లపై హత్య ఆరోపణలు చేశారు. నిందితుల ప్రభావంతో దర్యాప్తు దెబ్బతినొచ్చని కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






