Rekha Gupta | ఢిల్లీలో భయ్యాని తరిమికొట్టారు.. ఇప్పుడు దీదీ వంతు : రేఖా గుప్తా
Rekha Gupta | అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) సమీపిస్తున్న వేళ.. పశ్చిమ బెంగాల్‌లో రాజకీయాలు వేడెక్కాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ లక్ష్యంగా విపక్ష పార్టీలు విరుచుకుపడుతున్నాయి.
Rekha Gupta | అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) సమీపిస్తున్న వేళ.. పశ్చిమ బెంగాల్‌లో రాజకీయాలు వేడెక్కాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ లక్ష్యంగా విపక్ష పార్టీలు విరుచుకుపడుతున్నాయి. తాజాగా మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Rekha Gupta) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజధానిలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ( Arvind Kejriwal)ను ప్రజలు ఎలాగైతే సాగనంపారో.. బెంగాల్ ప్రజలు కూడా దీదీని అలాగే సాగనంపుతారని ఆమె వ్యాఖ్యానించారు. "భయ్యా టర్న్ అయిపోయింది.. ఇప్పుడు దీదీ వంతు" (Bhaiya Gone Didis Turn Next) అంటూ వ్యాఖ్యానించారు.
కోల్‌కతాలో జరిగిన ఓ బహిరంగ సభలో రేఖా గుప్తా ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. "ఢిల్లీలో భయ్యా (అరవింద్ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి) ఉండేవారు.. బెంగాల్‌లో దీదీ ఉన్నారు. భయ్యాను ప్రజలు తరిమికొట్టారు. ఇప్పుడు దీదీ వంతు. వారిద్దరూ ఒక్కటే.. ప్రజాధనంతో చేసే సంక్షేమ పథకాలపై తమ పేర్లు ఉండాలని కోరుకుంటారు" అని రేఖా గుప్తా ఎద్దేవా చేశారు. బెంగాల్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్లు పంపిస్తున్నా ఆ డబ్బు పేదలకు చేరడంలేదని, అసలు ఆ నిధులన్నీ ఎటు వెళ్తున్నాయని ఆమె ప్రశ్నించారు.
ఈ సందర్భంగా దీదీపై రేఖా గుప్తా తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో మహిళా ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ అక్కడ ఆడపిల్లలకు భద్రత లేదని, మహిళల గౌరవానికి విలువ లేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితి దేశంలోనే కాదు, ప్రపంచంలోనూ ఎక్కడా లేదని విమర్శించారు. రాష్ట్రంలో గూండాగిరి, అవినీతి రాజకీయాలకు ముగింపు పలికే సమయం ఆసన్నమైందన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఈ సందర్భంగా రేఖా గుప్తా ధీమా వ్యక్తం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

Excise Scam Case | కోర్టు ధిక్కరణ కేసు.. ఆప్ నేతలకు ఢిల్లీ హైకోర్టు తాఖీదులు..
మే 19, 2026

R. G. Kar Medical College | సందీప్ ఘోష్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి.. ఆర్జీకర్ కేసులో బిగుస్తున్న ఉచ్చు
మే 19, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



