త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

సడెన్ గా పోలీసులు ఎంటర్ అయ్యారు..దాంతో ఆ అమ్మాయి..

హోట‌ల్లో (hotel) పార్టీ జ‌రుగుతున్న‌ది. అంద‌రూ ఎంజాయ్ చేస్తున్నారు. అర్ధ‌రాత్రి (midnight) వ‌ర‌కు మందు (alcohol) , విందు, డ్యాన్సులు..ఇలా సాగిపోతూనే ఉంది. ఆ అర్ధ‌రాత్రి కాస్తా తెల్ల‌వారుజాము కూడా అయ్యింది. అప్పుడే..పోలీసులు (Police) ఎంట‌ర‌య్యారు

J

National | Published On Dec 15, 2025, 2.24 pm IST

సడెన్ గా పోలీసులు  ఎంటర్ అయ్యారు..దాంతో ఆ అమ్మాయి..
Advertisement

21 ఏళ్ల ఓ యువతి హోటల్ నుంచి తప్పించుకోవడం కోసం డ్రైనేజ్ పైప్‌ పట్టుకొని కిందికి దిగబోయి బాల్కనీ నుంచి కింద పడి తీవ్ర గాయాలపాలయ్యింది. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఆ యువతి, ఆమె తండ్రి ఇద్దరూ కలిసి బ్రూక్‌ఫీల్డ్‌లో ఉన్న సీ ఎస్టా లాడ్జ్ అనే హోటల్‌కి పార్టీ కోసం వెళ్లారు. వాళ్లతో పాటు మరో ఏడుగురు వ్యక్తులు పార్టీలో జాయిన్ అయ్యారు. అర్ధరాత్రి అయినా వాళ్ల పార్టీ ఆపకపోవడం, డిస్టర్బెన్స్ చేస్తున్నారని పక్కనే ఉన్న బిల్డింగ్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హోటల్‌లో మూడు రూములు బుక్ చేసి అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు పార్టీ చేస్తూ పక్క బిల్డింగ్ వాళ్లను డిస్టర్బ్ చేస్తున్నారని 112 హెల్ప్ లైన్‌కి పొరుగు వాళ్లు కాల్ చేశారు.

దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వాళ్లను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈనేపథ్యంలో అక్కడే ఉన్న యువతి భయంతో డ్రైనేజ్ పైప్ పట్టుకొని కిందికి దిగేందుకు ప్రయత్నించి బాల్కనీ నుంచి కింద పడింది. దీంతో తనకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో తనను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement