త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bengaluru Woman Kills Self | మూడు రోజుల కింది సాంబారు వేడి చేసి భర్తకు వడ్డించిన భార్య.. భర్త తిట్టడంతో ఆత్మహత్య

ఐదేళ్ల కింద రంగస్వామి అనే వ్యక్తితో కావ్యకు పెళ్లయింది. తనకు నాలుగేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. వీళ్లది బెంగళూరు. మూడు రోజుల కింద కావ్య సాంబారు వండింది. అదే సాంబారును మూడు రోజుల తర్వాత తన భర్త రంగస్వామికి మళ్లీ వేడి చేసి వడ్డించింది.

J

Crime | Published On Mar 7, 2026, 5.24 pm IST

Bengaluru Woman Kills Self | మూడు రోజుల కింది సాంబారు వేడి చేసి భర్తకు వడ్డించిన భార్య.. భర్త తిట్టడంతో ఆత్మహత్య
Advertisement

Bengaluru Woman Kills Self | ఈ జనరేషన్ వాళ్లు చాలా సెన్సిటివ్‌గా ఉంటున్నారు. ఎవరైనా ఏదైనా అంటే చాలు కోపం కట్టలు తెంచుకొని వాళ్లను ఏదైనా చేయడం లేదా తమను తాము హానీ చేసుకోవడం పరిపాటి అయింది. ముఖ్యంగా జెన్‌జెడ్‌లో ఈ తరహా మెంటాలిటీని చూడాల్సి వస్తోంది. ఒకప్పటి జనరేషన్ అన్ని రకాల కష్టాలను ఎదుర్కొని నిలబడింది. కానీ.. నేటి జనరేషన్ చిన్న గొడవలు, సమస్యలకే ఆత్మహత్య వరకు వెళ్తోంది. తాజాగా జరిగిన ఘటన కూడా అలాంటిదే. చిన్న విషయానికే ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. 27 ఏళ్ల కావ్య తన భర్తతో జరిగిన చిన్న గొడవ కారణంగా ఇంట్లో ఉన్న పంటకు వేసే పెస్టిసైడ్‌ను తాగి ఆత్మహత్య చేసుకుంది.

Bengaluru Woman Kills Self | అసలేం జరిగిందంటే?

ఐదేళ్ల కింద రంగస్వామి అనే వ్యక్తితో కావ్యకు పెళ్లయింది. తనకు నాలుగేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. వీళ్లది బెంగళూరు. మూడు రోజుల కింద కావ్య సాంబారు వండింది. అదే సాంబారును మూడు రోజుల తర్వాత తన భర్త రంగస్వామికి మళ్లీ వేడి చేసి వడ్డించింది. దీంతో రంగస్వామికి కోపం వచ్చి కావ్యపై అరిచాడు. కొట్టబోయాడు కూడా. భర్త ఒక్కసారిగా కోపోద్రికుడయ్యేసరికి తట్టుకోలేని కావ్య ఇంట్లోనే ఉన్న పెస్టిసైడ్ మందు తాగింది. తను అపస్మారక స్థితిలో పడి ఉండటం చూసిన కుటుంబ సభ్యులు తనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ.. మార్గమధ్యంలోనే వాంతి చేసుకొని పరిస్థితి విషమించి కావ్య కన్నుమూసింది. దీంతో పోస్ట్‌మార్టం కోసం తన మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement