Mamata Banerjee | న్యాయం మూసిన తలుపుల వెనుక ఏడుస్తోంది.. సర్‌పై సుప్రీంలో వాదనలు వినిపించిన బెంగాల్ సీఎం
Mamata Banerjee | ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)కు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.
Mamata Banerjee | ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)కు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. సర్‌ను సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టు ( Supreme Court)లో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ విచారణ జరిగింది. ఈ విచారణకు దీదీ స్వయంగా హాజరయ్యారు. అంతేకాదు, బెంచ్ ముందు తన వాదనలు వినిపించారు.
విచారణ ప్రారంభమవడానికి ముందు దీదీ.. సీజేఐ ఛాంబర్‌కు వెళ్లి ఈ కేసలో వాదనలు వినిపించడానికి తనకు ఐదు నిమిషాలు సమయం ఇవ్వాలని కోరారు. దీనికి సీజేఐ అంగీకరించారు. మమతా బెనర్జీకి 15 నిమిషాలు సమయం ఇచ్చారు. దీంతో కోర్టులో దీదీ వాదనలు వినిపించారు. "న్యాయం మూసిన తలుపుల వెనుక ఏడుస్తోంది" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన అభ్యర్థనలను భారత ఎన్నికల సంఘం విస్మరించిందని దీదీ ఆరోపించారు. చివరికి తమకు ఎక్కడా న్యాయం జరగకపోవడమే సమస్య అంటూ వాదించారు. సర్ ప్రక్రియకు సంబంధించిన ఈసీఐకి (Election Commission) తాను ఆరుసార్లు లేఖ రాసినట్లు చెప్పారు. కానీ ఇప్పటికీ ఎలాంటి సమాధానం రాలేదని వాపోయారు.
దీదీ వాదనలు..
దీదీ వాదనలను న్యాయమూర్తులు జోయ్‌మల్య బాగ్చి, వీఎం పంచోలిలతో కూడిన ధర్మాసనం అంగీకరించింది. సీఎం ఆవేదనలో నిజం ఉందని, ప్రతీ సమస్యకూ పరిష్కారం ఉంటుందని హామీ ఇచ్చింది. అనంతరం మమతా బెనర్జీ పిటిషన్‌పై స్పందన కోరుతూ ఎన్నికల సంఘానికి ధర్మాసనం నోటీసు కూడా జారీ చేసింది. ఫిబ్రవరి 10లోపు స్పందన తెలియజేయాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
విచారణ సందర్భంగా.. ఈసీఐపై మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ప్రక్రియలో ఆధార్‌ను అంగీకరించకుండా కోర్టు ఆదేశాలను ఎన్నికల సంఘం ఉల్లింఘిస్తోందని ఆరోపించారు. ఎన్నికల ముందు తమ రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. సర్ ఒత్తిడి కారణంగా 100 మందికిపైగా ప్రజలు మరణించారని దీదీ ఆరోపించారు. అనేక మంది ఆసుపత్రి పాలయ్యారన్నారు. ప్రజల హక్కలును కాపాడండి అంటూ దీదీ తన వాదనలను ముగించారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






