త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ajit Agarkar | 2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ వ‌ర‌కు చీఫ్ సెలెక్ట‌ర్‌గా అజిత్ అగార్క‌ర్‌..! బీసీసీఐ కీల‌క‌ నిర్ణ‌యం..!

Ajit Agarkar | భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఒప్పందాన్ని మరో ఏడాది పాటు పున‌రుద్ధ‌రించేందుకు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. 2027 వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకొని అగార్క‌ర్‌ను కొన‌సాగించేందుకు ఆస‌క్తితో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

P

National | Published On Apr 19, 2026, 4.33 pm IST

Ajit Agarkar | 2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ వ‌ర‌కు చీఫ్ సెలెక్ట‌ర్‌గా అజిత్ అగార్క‌ర్‌..! బీసీసీఐ కీల‌క‌ నిర్ణ‌యం..!
Advertisement

Ajit Agarkar | భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఒప్పందాన్ని మరో ఏడాది పాటు పున‌రుద్ధ‌రించేందుకు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. 2027 వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకొని అగార్క‌ర్‌ను కొన‌సాగించేందుకు ఆస‌క్తితో ఉన్న‌ట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో దక్షిణాఫ్రికాలో వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో టోర్నీ ముందు సెలెక్టర్ మార్పు జట్టుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని బీసీసీఐ భావిస్తోంది. అవసరమైతే అగార్కర్ పదవీకాలాన్ని వరల్డ్ కప్ వరకు మరింత పొడిగించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.

అగార్కర్ నాయకత్వంలో భారత జట్టు అక్టోబర్ 2023 నుంచి మార్చి 2026 వరకు జరిగిన నాలుగు ఐసీసీ టోర్నీల ఫైనల్స్‌కు చేరుకుంది. ఇందులో మూడు టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. ఇందులో రెండు టీ20 వరల్డ్ కప్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీ ఉన్నాయి. ఈ విజయాల నేపథ్యంలో ఆయన ఒప్పందాన్ని పున‌రుద్ధ‌రించిన‌ట్లుగా సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా బీసీసీఐకు చెందిన ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ.. అగార్కర్ స్వయంగా పొడిగింపును కోర‌లేద‌ని.. గ‌రిష్టంగా ఒక సెలెక్ట‌ర్ నాలుగేళ్లు మాత్ర‌మే కొన‌సాగేందుకు అవ‌కాశం ఉంద‌న్నారు. ఇది పొడిగింపు కాద‌ని.. ఒప్పందం పున‌రుద్ధ‌ర‌ణ‌గా ప‌రిగ‌ణించాల్సి ఉంటుంద‌న్నారు. తన భవిష్యత్తును తన పనితీరే నిర్ణయించాలన్న దృక్పథంతో అగార్కర్ పనిచేస్తున్నారని సమాచారం.

అగార్కర్ హయాంలో సెలెక్షన్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టు రిటైర్మెంట్లను సాఫీగా నిర్వహించడం, మహమ్మద్ షమీ స్థానంలో యువ ఫాస్ట్ బౌలర్లకు అవకాశాలు ఇచ్చేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. టీ20 వరల్డ్ కప్ జట్టులో శుభ్‌మన్ గిల్‌ను పక్కన పెట్టి, ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌కు అవకాశం కల్పించడం వంటి కీలక నిర్ణ‌యాలు తీసుకుంది. 2027 వన్డే వరల్డ్ కప్ ముందు జట్టులో స్థిరత్వం అత్యంత ముఖ్యమని బీసీసీఐ భావిస్తోంది. అగార్కర్ కొనసాగింపుతో సెలెక్షన్ ప్రక్రియలో స్థిర‌త్వం, దీర్ఘకాల ప్రణాళిక ప్రకారం జట్టును సిద్ధం చేసే అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో అగార్కర్ సమన్వయం బాగుంది. అయితే, స్వ‌దేశంలో టెస్టుల్లో ఓట‌ముల‌ను దృష్టిలో పెట్టుకొని భ‌విష్య‌త్‌లో మెరుగులు దిద్దాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

Advertisement
Advertisement