త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jai Anmol | అంబానీ కొడుకుపై 228 కోట్ల‌ బ్యాంక్ ఫ్రాడ్ కేసు

ఆర్‌హెచ్ఎఫ్ఎల్ కంపెనీకి బ్యాంకు 2015 నుంచి 2019 మ‌ధ్య‌లో రూ.450 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. దానితో పాటు రూ.100 కోట్ల విలువైన నాన్ క‌న్వ‌ర్ట‌బుల్ డిబెంచ‌ర్ల‌ను కూడా అందించింది. 

J

National | Published On Dec 9, 2025, 5.11 pm IST

Jai Anmol | అంబానీ కొడుకుపై 228 కోట్ల‌ బ్యాంక్ ఫ్రాడ్ కేసు
Advertisement
Jai Anmol | ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ కొడుకు జై అన్మోల్‌పై కేసు న‌మోద‌యింది. సీబీఐ ఈ కేసు ఫైల్ చేసింది. రిల‌యెన్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(RHFL) కు సంబంధించి బ్యాంకింగ్ ఫ్రాడ్‌కు పాల్ప‌డిన‌ట్టుగా సీబీఐ(CBI) గుర్తించి క్రిమిన‌ల్ కేసు రిజిస్ట‌ర్ చేసింది. అనిల్ అంబానీ(Anil Ambani) కొడుకు మీద క్రిమిన‌ల్ కేసు న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి.
బ్యాంకు నుంచి లోన్ తీసుకొని దాన్ని తిరిగి చెల్లించే విష‌యంలో కుట్ర ప‌న్ని బ్యాంక్‌కే రూ.228.06 కోట్ల న‌ష్టం చేకూర్చార‌ని  ఆర్‌హెచ్ఎఫ్ఎల్ కంపెనీకి చెందిన డైరెక్ట‌ర్ల‌పై కూడా కేసులు న‌మోదు చేశారు.
జై అన్మోల్, డైరెక్ట‌ర్ ర‌వీంద్ర సుదాల్క‌ర్, మ‌రికొంద‌రు క‌లిసి ఈ కుట్ర‌కు పాల్ప‌డిన‌ట్టుగా యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ అనుప్ వినాయ‌క్ త‌రాలే సీబీఐకి ఫిర్యాదు చేశారు.
ఆర్‌హెచ్ఎఫ్ఎల్ కంపెనీకి బ్యాంకు 2015 నుంచి 2019 మ‌ధ్య‌లో రూ.450 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. దానితో పాటు రూ.100 కోట్ల విలువైన నాన్ క‌న్వ‌ర్ట‌బుల్ డిబెంచ‌ర్ల‌ను కూడా అందించింది.
ఆర్‌హెచ్ఎఫ్ఎల్ కంపెనీ నేష‌న‌ల్ హౌసింగ్ బ్యాంక్‌లో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా రిజిస్ట‌ర్ అయింది. ఆ త‌ర్వాత సెప్టెంబ‌ర్ 2017 లో నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్, బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో లిస్ట్ అయింది.
కంపెనీ మాజీ డైరెక్ట‌ర్లు అయిన జై అన్మోల్, ర‌వీంద్ర శ‌ర‌ద్ సుదాల్క‌ర్ కంపెనీ డెవ‌ల‌ప్‌మెంట్ కోసం తీసుకున్న రుణాల‌ను దారి మ‌ళ్లించార‌ని బ్యాంక్ ఆరోపిస్తోంది.
2019 వ‌ర‌కు కంపెనీ మూత ప‌డే స్థాయికి చేరుకుంది. దీంతో బ్యాంక్‌కు తిరిగి చెల్లించాల్సిన రుణాన్ని కంపెనీ చెల్లించ‌లేక‌పోవ‌డంతో బ్యాంక్‌కి రూ.228.06 కోట్ల న‌ష్టం వాటిల్లింద‌ని.. దీంతో 10 అక్టోబ‌ర్ 2024 న కంపెనీని ఫ్రాడ్‌గా డిక్లేర్ చేసి ఆర్‌బీఐకి రిపోర్ట్ చేసిన‌ట్లు బ్యాంక్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement