Bangladesh | ప్రధాని కాదు.. లోక్‌సభ స్పీకర్..! తారిక్ ప్రమాణ స్వీకారానికి ఓం బిర్లా..!
Bangladesh | బంగ్లాదేశ్ కాబోయే ప్రధాని తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి భారత్ తరఫున లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని ప్రచారం జరిగింది.
Bangladesh | బంగ్లాదేశ్ కాబోయే ప్రధాని తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి భారత్ తరఫున లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని ప్రచారం జరిగింది. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్, వివిధ దేశాల నుంచి ప్రముఖులు రానున్న నేపథ్యంలో ప్రధాని షెడ్యూల్ బిజీగా ఉండడంతో ఆయన తారిక ప్రమాణ స్వీకారానికి హాజరుకావడం లేదు. ఫిబ్రవరి 17న ముంబయిలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.
విదేశాంగ మంత్రిత్వశాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. 17న ఢాకాల్లో నేషనలిస్ట్ పార్టీ చైర్మన్ తారిక్ నేతృత్వంలో కొత్తగా ఎన్నికైన బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో భారత ప్రభుత్వం తరఫున లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరవుతారని తెలిపింది. కార్యక్రమానికి స్పీకర్ పాల్గొనడం భారత్-బంగ్లాదేశ్ పాల్గొనడం రెండుదేశాల మధ్య శాశ్వత స్నేహాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపింది. చరిత్ర, సంస్కృతి, పరస్పర గౌరవంతో పొరుగు దేశంగా తారిక్ రెహమాన్ నేతృత్వంలో బంగ్లాదేశ్‌లో ఎన్నికైన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని భారత్ స్వాగతిస్తోందని.. ఆయన దార్శనికత, విలువలకు ప్రజల నుంచి భారీ మద్దతు లభించిందని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటనలో పేర్కొంది. భారత్‌తో పాటు చైనా, పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ, యూఏఈ, ఖతార్, మలేషియా, బ్రూనై, శ్రీలంక, నేపాల్, మాల్దీవులు, భూటాన్ దేశాల నుంచి అతిథులను బంగ్లాదేశ్ ఆహ్వానించింది. ప్రమాణ స్వీకారం ఈ నెల 17న పార్లమెంట్ సౌత్ ప్లాజాలో జరుగనున్నది.
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) అఖండ మెజారిటీని సాధించింది. తారిక్ రెహమాన్ నేతృత్వంలోని కొత్త బీఎన్‌పీ ప్రభుత్వం ఫిబ్రవరి 17న ప్రమాణ స్వీకారం చేయనుంది. తారిక్ రెహమాన్ మంత్రివర్గంలో 32 నుంచి 42 మంది ఉండే అవకాశం ఉంది. సీనియర్లు, యువ నేతలను మంత్రివర్గంలోకి తీసుకునే వకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ 13వ జాతీయ ఎన్నికల్లో బీఎన్‌పీ 300 సీట్లలో 212 స్థానాలను గెలుచుకోగా, జమాతే-ఇ-ఇస్లామీ కూటమి 77 స్థానాలను గెలుచుకుంది. ఇస్లామీ ఆందోళన్ బంగ్లాదేశ్ పార్టీ ఒక స్థానాన్ని గెలుచుకోగా, స్వతంత్ర అభ్యర్థులు ఏడు స్థానాల్లో గెలుపొందారు. మాజీ పాలక పార్టీ అయిన అవామీ లీగ్ (షేక్ హసీనా పార్టీ) ఎన్నికల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వలేదు. శుక్రవారం తారిక్ రెహమాన్‌తో ప్రధాని ఫోన్‌లో మాట్లాడారు. ఎన్నికల విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. రెండు దేశాల శాంతి, పురోగతి, శ్రేయస్సు కోసం భారత్ సహకారం అందిస్తుందన్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






