త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | ర‌క్తం పాకెట్ల‌తో రాజ‌కీయాలు వ‌ద్దు : మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్

Ponnam Prabhakar | కాళేశ్వ‌రం ప్రాజెక్టు కూల‌డానికి కార‌ణం బీఆర్ఎస్ పార్టీనే.. ఊరురా తిరిగి ఆ పార్టీ కుట్ర‌ల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేస్తామ‌ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ పేర్కొన్నారు. ర‌క్తం పాకెట్ల‌తో రాజ‌కీయం చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న తెలిపారు.

S

Telangana | Published On Jul 14, 2026, 2.26 pm IST

Ponnam Prabhakar | ర‌క్తం పాకెట్ల‌తో రాజ‌కీయాలు వ‌ద్దు : మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్
Advertisement

Ponnam Prabhakar | త్రినేత్ర‌.న్యూస్ : కాళేశ్వ‌రం ప్రాజెక్టు కూల‌డానికి కార‌ణం బీఆర్ఎస్ పార్టీనే.. ఊరురా తిరిగి ఆ పార్టీ కుట్ర‌ల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేస్తామ‌ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ పేర్కొన్నారు. ర‌క్తం పాకెట్ల‌తో రాజ‌కీయం చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న తెలిపారు. ఎమ్మెల్యే క్వార్ట‌ర్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ మాట్లాడారు.

అనేక మంది శాస్త్రవేత్తలు ఎల్ నినో ప్రభావంతో వాతావరణ శాఖ వర్షాభావ పరిస్థితులు ఇబ్బందులు ఉంటాయని చెబుతున్నారు. ఎన్డీఎస్ఏ తుది నివేదిక ప్ర‌కారం నీళ్లు నింప‌మ‌ని చెప్తే మేం వెంట‌నే నింపుతాం. మేము ఇంజినీర్లం కాదు.. ఇంజినీర్లు ఇచ్చిన సలహాలు పాటిస్తాం. ప్రాజెక్ట్ ఉపయోగంలోకి రావాలంటే ఏమి చేయాలో నిపుణులు చెబితే వెంటనే అమలు చేస్తామ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు.

కావాల‌ని మేడిగ‌డ్డ‌, క‌న్నెప‌ల్లిపై రాజ‌కీయం

గత రెండు సంవత్సరాలుగా మాట్లాడని బీఆర్ఎస్ పార్టీ మౌనంగా ఉండి ఇప్పుడు కరువును దృష్టిలో పెట్టుకొని ప్రజలను రెచ్చగొడుతున్నారు. బీఆర్ఎస్ నేత‌లు కావాల‌ని మేడిగ‌డ్డ‌, క‌న్నెప‌ల్లిపై రాజ‌కీయం చేస్తున్నారు. సాంకేతిక నిపుణులతో నేషనల్ డ్యామ్‌ సేఫ్టీ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎల్ నినో ఎదుర్కోవడానికి ప్రభుత్వం తరుపున సూచనలు చేస్తున్నాం.. కరువును దృష్టిలో పెట్టుకొని రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి అని పొన్నం ప్ర‌భాక‌ర్ సూచించారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో కోట్లడాలి

శంకర పరివారంలో ఆవు, పాము, నెమలి ఉంటాయి.. ఇవ‌న్నీ వ్యక్తిగతంగా వైరుధ్యం ఉన్న అక్కడ కలిసి ఉంటాయి. ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో కోట్లడాలి. రాజకీయ పార్టీలుగా అంతర్గతంగా ఎన్ని సమస్యలు ఉన్నా కలిసి ఎదుర్కోవాలి. మేము డెమోక్రటిక్‌గా ప్రభుత్వంలో ఉన్న భాగస్వాములమ‌ని మంత్రి తెలిపారు.

ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు

బండి సంజయ్ ఎన్డీఎస్ఏ తుది నివేదిక ఇవ్వమని చెప్పండి. వారు చెప్పిన ప్రకారం డ్యామ్‌లో నీళ్ళు నింపుతాం. నింపిన తరువాత ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు. తెలంగాణ రైతుల ప్రయోజనాలు దృష్టిలో పేట్టుకొని నిపుణులతో నివేదిక స్పష్టం వచ్చిన తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గత రెండు సంవత్సరాలు గేట్లు వేయనప్పుడు ఎవరు మాట్లాడలేదు. కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వానికి సూచనలు చేయవచ్చు. లేనిది ఉన్నట్టు బట్ట కాల్చి మీద వేయవద్దు. రక్తం పాకెట్‌ల‌తో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. బాధ్యతగా ప్రతిపక్షం సలహాలు సూచనలు ఇవ్వండి అని పొన్నం ప్ర‌భాక‌ర్ సూచించారు.

Advertisement
Advertisement