Union Budget 2026 | తగ్గనున్న క్యాన్సర్‌తో సహా ప్రాణాంతక వ్యాధుల మందుల ధరలు..!
Union Budget 2026 | ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్‌న్యూస్ చెప్పారు. దేశ ఆరోగ్య సంరక్షణ రంగాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి పలు కీలక ప్రకటన చేశారు. భారతదేశాన్ని 'గ్లోబల్ బయోఫార్మాస్యూటికల్ హబ్'గా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.
Union Budget 2026 | ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్‌న్యూస్ చెప్పారు. దేశ ఆరోగ్య సంరక్షణ రంగాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి పలు కీలక ప్రకటన చేశారు. భారతదేశాన్ని 'గ్లోబల్ బయోఫార్మాస్యూటికల్ హబ్'గా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. సాధారణ ప్రజలు తీవ్రమైన వ్యాధుల చికిత్స కోసం భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని.. క్యాన్సర్, డయాబెటిస్, ఆటో ఇమ్యూన్ వ్యాధులకు మందులను సరసమైన ధరలకు అందుబాటులోనే ఉంచనున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించనున్నారు.
ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు నాన్-కమ్యూనికబుల్ వ్యాధుల చికిత్సను అందుబాటులోకి తెస్తామని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఇందు కోసం రాబోయే 10 సంవత్సరాలలో భారీగా రూ.10వేల కోట్లు ఖర్చు చేయాలని యోచిస్తోందని, ఈ పెట్టుబడి ఔషధ ధరలను తగ్గించడమే కాకుండా బయోఫార్మాస్యూటికల్ పవర్, బయోలాజిక్స్ ఉత్పత్తిలో భారత్‌ను గ్లోబల్ లీడర్‌గా నిలబెడుతుందన్నారు.
ఆటో ఇమ్యూన్ వ్యాధులంటే.. మన రోగనిరోధక వ్యవస్థ పొరపాటున మన కణాలపై దాడి చేస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్, లూపస్, టైప్ 1 డయాబెటిస్ వంటి వ్యాధులు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ మందులు, బయోలాజిక్ ఇంజెక్షన్ల ధర ఎక్కువగా ఉంటుంది. బడ్జెట్ తర్వాత ఆయా మందుల ధరల తగ్గనుండగా.. రోగులపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుందని ఆశిస్తున్నారు.
భారత్‌ను గ్లోబల్ ఫార్మాస్యూటికల్ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం 10 సంవత్సరాల ప్రణాళికను ప్రకటించింది. రూ.10వేలకోట్ల పెట్టుబడి పెట్టనున్నది. దాంతో బయో-ఫార్మా కేంద్రీకృత నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నది. ఈ నెట్‌వర్క్‌లో మూడు జాతీయ సంస్థలు కలిసి పనిచేస్తాయి. ఫార్మాస్యూటికల్స్, విద్య, పరిశోధనతో ఇది ఔషధాల నాణ్యతను మెరుగుపరుస్తుంది. కొత్త మందుల ఆవిష్కరణను వేగవంతం చేస్తుంది. దాంతో భారత్ ఖరీదైన మందులను దిగుమతి చేసుకోవటంపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది.
మందుల నాణ్యతను నిర్ధారించేందుకు ఆర్థిక మంత్రి సెంట్రల్ డ్రగ్ కంట్రోలర్‌కు మరిన్ని అధికారాలు కల్పించేందుకు ప్రతిపాదించారు. మేడ్ ఇన్ ఇండియా మందులపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకాన్ని పొందగలిగేలా భారతీయ ఔషధాలను ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మార్చడమే లక్ష్యమన్నారు. కఠిన నిబంధనలు, మెరుగైన పర్యవేక్షణతో ఫేక్ మందులను అరికట్టేందుకు, బయోఫార్మాస్యూటికల్ రంగంలో ఆవిష్కరణలను పెంపొందిస్తాయన్నారు. ఈ చొరవ ఆరోగ్య సంరక్షణ రంగంలో వ్యాపార సౌలభ్యాన్ని ప్రోత్సహిస్తుందన్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






