త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Assembly Elections | అసెంబ్లీ ఎన్నిక‌లు.. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో కొన‌సాగుతున్న పోలింగ్‌

Assembly Elections | అస్సాం (Assam), కేరళంతోపాటు (Keralam) కేంద్ర‌పాలిత ప్రాంత‌మైన‌ పుదుచ్చేరిలో (Puducherry) శాస‌నస‌భ ఎన్నిక‌ల పోలింగ్ (Assembly Elections) కొన‌సాగుతున్న‌ది. ఉద‌యం 7 గంల‌కు ప్రారంభ‌మైన సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు జ‌రుగ‌నుంది.

G

National | Published On Apr 9, 2026, 7.47 am IST

Assembly Elections | అసెంబ్లీ ఎన్నిక‌లు.. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో కొన‌సాగుతున్న పోలింగ్‌
Advertisement

Assembly Elections | త్రినేత్ర‌.న్యూస్‌: అస్సాం (Assam), కేరళంతోపాటు (Keralam) కేంద్ర‌పాలిత ప్రాంత‌మైన‌ పుదుచ్చేరిలో (Puducherry) శాస‌నస‌భ ఎన్నిక‌ల పోలింగ్ (Assembly Elections) కొన‌సాగుతున్న‌ది. ఉద‌యం 7 గంల‌కు ప్రారంభ‌మైన సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు జ‌రుగ‌నుంది. మొత్తం 296 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగుతున్న‌ది. ఓటింగ్ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఓట‌ర్లు బారులు తీరారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌రుగ‌కుండా భారీగా పోలీసుల‌ను మోహ‌రించారు. మూడు రాష్ట్రాల్లో ఒకే విడ‌త‌లో పోలింగ్ జ‌రుతుండ‌గా, మే 4న ఓట్ల‌ను లెక్కించ‌నున్నారు.

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 స్థానాలకు పోలింగ్ జరగుతున్న‌ది. ఇక్క‌డ‌ 294మంది అభ్యర్థులు బరిలో ఉండ‌గా, 9,48,977 మంది ఓటర్లు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకోనున్నారు. అందులో 4,45,761 మంది పురుషులు, 5,03,076 మంది మహిళలు, 140 మంది ట్రాన్స్​జెండర్లు ఉన్నారు. అయితే, ప్రధానంగా ఎన్​డీఏ- ఇండియా కూటమికి మధ్య పోటీ నెలకొంది. 1,099 పోలింగ్‌ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు.

అసోంలోని 126అసెంబ్లీ స్థానాల్లో 722మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 2.5కోట్ల మంది ఓటర్లు ఉండ‌గా, వారికోసం 31,490 పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. ఇక్క‌డ ప్ర‌ధానంగా బీజేపీ, కాంగ్రెస్ మ‌ధ్య పోటీ నెల‌కొన్న‌ది. కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 99 స్థానాల్లో, బీజేపీ 90 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. మొత్తం అభ్యర్థుల్లో కేవలం 59 మంది మాత్రమే మహిళలు ఉండటం గమనార్హం.

కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. మొత్తం 883 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రాష్ట్రంలోని 2.71 కోట్ల మంది ఓటర్ల కోసం 30, 495 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 1.32 కోట్ల మంది పురుషులు, 1.39 కోట్ల మంది మహిళలు, 273 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. ప్రధానంగా ఎల్​డీఎఫ్, యూడీఎఫ్, ఎన్​డీఏ కూటముల మధ్య పోటీ నెలకొంది.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పెద్ద సంఖ్య‌లో ఓటర్లు పాల్గొనాల‌ని కేర‌ళం ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని మోదీ (PM Modi) పిలుపునిచ్చారు. రికార్డు స్థాయిలో పాల్గొన‌డం ద్వారా కేర‌ళం (Keralam) ప్ర‌జాస్వామ్య స్ఫూర్తిని చాటాల‌న్నారు. ప్ర‌త్యేకంగా మ‌హిళ‌లు, యువ‌త ఓటు వేయ‌డానికి భారీగా త‌ర‌లిరావాల‌ని కోరారు.

 

Advertisement
Advertisement