Free Cylinders | మళ్లీ అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు సిలిండర్లు ఫ్రీ.. ప్రకటించిన అసోం సీఎం
Free Cylinders | రెండు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా (Free Cylinders) ఉస్తామంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ (Himanta Biswa Sarma) ప్రకటించారు. మళ్లీ అధికారంలోకి వస్తే దీనిని అమలు చేస్తామని చెప్పారు. దీనికోసం ప్రజలు ఒక్కపైసా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.
Free Cylinders | త్రినేత్ర.న్యూస్: ఇరాన్, అమెరికా యుద్ధంతో దేశంలో గ్యాస్ కొరత ప్రజలను వేధిస్తున్నది. రెండు సిలిండ్ల బుకింగ్‌కు (Free Cylinders) మధ్య కేంద్ర ప్రభుత్వం 25 రోజుల గడువు పెట్టింది. బుక్ అయిన తర్వాత మరో రెండు వారాలకు సిలిండర్ వస్తున్నది. దీంతో గృహావసరాల సిలిండర్ కోసం ప్రజలు 40 రోజులపాటు వేచిచూడాల్సి వస్తున్నది. ఇక ఆటో గ్యాస్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆటో, క్యాబ్ డ్రైవర్లు గ్యాస్ కోసం ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద కిలోమీటర్ల మేర లైన్లలో వేచిచూస్తున్నారు. ఈ సంక్షోభ సమయంలో.. రెండు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఉస్తామంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ (Himanta Biswa Sarma) ప్రకటించారు. మళ్లీ అధికారంలోకి వస్తే దీనిని అమలు చేస్తామని చెప్పారు. దీనికోసం ప్రజలు ఒక్కపైసా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి సంవత్సరం బిహు పండుగ ముందు ఒకటి, దుర్గా పూజ ముందు మరొకటి ఇస్తామంటూ తెలిపారు. అస్సాంలో మే 4న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
ఇలాంటి హామీనే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా ఇచ్చారు. గత నెల 24న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆమె.. హోలీ, దీపావళి పండుగల సందర్భంగా ప్రతి ఇంటికి ఒకటి చొప్పున ఏడాదికి రెండు ఎల్పీజీ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. దీనికోసం బడ్జెట్‌లో రూ.260 కోట్లు కేటాయించారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






