Rhino Attacks | పర్యాటకుల జీపును లేపి ఎత్తిపడేసిన ఖడ్గమృగం.. వీడియో
Rhino Attacks | జంగిల్ సఫారీలో (jungle safari) ప్రకృతిని ఆస్వాదిస్తూ, అరుదైన జంతువులను చూసి మురిసిపోదామనుకున్న పర్యాటకులకు భయానక అనుభవం ఎదురైంది. జీపులో వెళ్తుండగా ఓ ఖడ్గమృగం (Rhinoceros) వారిపైకి దూసుకొచ్చింది. జీపు దాడి చేసి, దానిని ఎత్తిపడేసేందుకు (Rhino Attacks) ప్రయత్నించింది.
Rhino Attacks | త్రినేత్ర.న్యూస్: జంగిల్ సఫారీలో (jungle safari) ప్రకృతిని ఆస్వాదిస్తూ, అరుదైన జంతువులను చూసి మురిసిపోదామనుకున్న పర్యాటకులకు భయానక అనుభవం ఎదురైంది. జీపులో వెళ్తుండగా ఓ ఖడ్గమృగం (Rhinoceros) వారిపైకి దూసుకొచ్చింది. జీపు దాడి చేసి, దానిని ఎత్తిపడేసేందుకు (Rhino Attacks) ప్రయత్నించింది. దీంతో పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన అస్సాంలోని మానస్ జాతీయ పార్కులో (Manas National Park) చోటుచేసుకున్నది.
పర్యాటకులు మానస్ జాతీయ పార్కులో జంగిల్ సఫారీ చేస్తున్నారు. వారి జీపు బన్స్‌బారి శ్రేణి గుండా వెళ్తుండగా ఖడ్గమృగం వారిని అడ్డగించింది. జీపు ముందు టైరును (డ్రైవర్ వైపు) తన కొమ్ముతో గుద్దింది. అనంతరం వెనుకకు వచ్చిన ఖడ్గమృగం తన కొమ్ముతో జీపును ఎత్తిపడేసేందుకు ప్రయత్నించింది. దీంతో పర్యాటకులు భయంతో గట్టిగా కేకలు వేశారు. అయితే అది శాంతించడంతో డ్రైవర్ జీపును మెల్లగా అక్కడి నుంచి తీసుకెళ్లారు. సఫారీ డ్రైవర్ సమయస్ఫూర్తిని ప్రదర్శించడంతో వారికి ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, పర్యాటకులు సురక్షింగానే ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
కాగా, జంతువులు భయపడినప్పుడు, కలత చెందినప్పుడు లేదా తమను తాము రక్షించుకోవాలని భావించినప్పుడు ఇలా ప్రవర్తిస్తాయని వన్యప్రాణి నిపుణులు తెలిపారు. అందువల్ల అటవీ జంతువులు ఎదురైనప్పుడు నిశ్శబ్దం పాటించాలని, ఉన్నచోటే కదలకుండా కూర్చోవాలని అధికారులు సఫారీ సందర్శకులకు సూచిస్తుంటారు.
Assam: A tourist safari in Manas National Park had a miraculous escape after a massive rhino nearly lifted their jeep with its horn in a dramatic close encounter. pic.twitter.com/mkej9qYgnk
— NextMinute News (@nextminutenews7) May 17, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






