త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maoists | మావోయిస్టు పార్టీకి మ‌రో భారీ ఎదురుదెబ్బ‌.. 52 మంది లొంగుబాటు

Maoists | మావోయిస్టు పార్టీకి మ‌రో భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో అక్క‌డి ఎస్పీ ఎదుట 52 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

A

National | Published On Jan 15, 2026, 6.51 pm IST

Maoists | మావోయిస్టు పార్టీకి మ‌రో భారీ ఎదురుదెబ్బ‌.. 52 మంది లొంగుబాటు
Advertisement

Maoists | త్రినేత్ర‌.న్యూస్‌ : మావోయిస్టు పార్టీ (Maoist Party)కి మ‌రో భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ (Bijapur) ఎస్పీ డాక్ట‌ర్ జితేంద్ర కుమార్ యాద‌వ్ ఎదుట 52 మంది మావోయిస్టులు (Maoists) లొంగిపోయారు. వారిలో 31 మంది పురుషులు ఉండ‌గా, మిగిలిన 21 మంది మ‌హిళ‌లు. లొంగిపోయిన వారిలో దండకార‌ణ్య స్పెష‌ల్ జోన్‌, ఏవోబీ, ఏరియా క‌మిటీల‌కు చెందిన మావోయిస్టులు ఉన్నార‌ని పోలీసులు తెలిపారు. వారిలో 49 మంది మావోయిస్టుల‌పై రూ.1.41 కోట్ల రివార్డు ఉంద‌ని చెప్పారు. రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన పున‌రావాస కార్య‌క్ర‌మంలో భాగంగా మావోయిస్టులు లొంగిపోయిన‌ట్లు వివ‌రించారు.

కాగా.. వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టుల అంతం తప్పదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత చేపట్టారు. ఇప్పటికే అనేక మంది మావోయిస్టులు భద్రతాబలగాల ఎదురుకాల్పుల్లో మరణించారు. వారిలో మావోయిస్టు కీలక నేతలు కూడా ఉన్నారు. మావోయిస్టు కీలక నేత హిడ్మాతో పాటు చలపతి, బాలకృష్ణ, గణేష్, కట్టా రామచంద్రారెడ్డి, బస్వరాజ్ ఇలా అనేక మంది ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల ఎదుట భారీస్థాయిలోనే మావోయిస్టులు లొంగిపోయారు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement