త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maoists | మ‌రో 26 మంది మావోయిస్టులు లొంగుబాటు

Maoists | ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని సుక్మా జిల్లాలో తాజాగా మ‌రో 26 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఏడుగురు మ‌హిళా మావోయిస్టులు ఉన్న‌ట్లు పోలీసు ఉన్న‌తాధికారులు పేర్కొన్నారు.

S

National | Published On Jan 7, 2026, 1.25 pm IST

Maoists | మ‌రో 26 మంది మావోయిస్టులు లొంగుబాటు
Advertisement

Maoists | త్రినేత్ర‌.న్యూస్ : ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని సుక్మా జిల్లాలో తాజాగా మ‌రో 26 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఏడుగురు మ‌హిళా మావోయిస్టులు ఉన్న‌ట్లు పోలీసు ఉన్న‌తాధికారులు పేర్కొన్నారు. ఇవాళ లొంగిపోయిన వారిలో 13 మంది మీద రూ. 65 ల‌క్ష‌ల రివార్డు ఉన్న‌ట్లు తెలిపారు.

వీరంతా పీపుల్స్ లిబ‌రేష‌న్ గెరిల్లా ఆర్మీ(PLGA) బెటాలియ‌న్‌లో చురుకుగా ఉన్న‌ట్లు పేర్కొన్నారు. ఆంధ్రా - ఒడిశా స‌రిహ‌ద్దుతో పాటు అబుజ్‌మ‌డ్‌లో అనేక హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు చెప్పారు. లాలి అలియాస్ ముచ‌కి అయితే ల‌ఖ్ము(35) అనే మావోయిస్టు త‌ల‌పై రూ. 10 ల‌క్ష‌ల రివార్డు ఉంద‌న్నారు. ల‌ఖ్ము అనేక హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డ్డారు. 2017లో ఒడిశాలోని కోరాపుట్ రోడ్డుపై ఐఈడీ బ్లాస్ట్ జ‌ర‌ప‌గా 14 మంది భ‌ద్ర‌తా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో ల‌ఖ్ము కీల‌క పాత్ర వ‌హించారు.

హేమ్లా ల‌ఖ్మా(41), అస్మిత అలియాస్ క‌మ్లు స‌న్నీ(20), రాంబాటి అలియాస్ ప‌డం జోగి(21), సుందమ్ పాలే(20) పై రూ. 8 ల‌క్ష‌ల చొప్పున రివార్డు ఉన్న‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. హేమ్లా ల‌ఖ్మా 2020లో సుక్మాలో జ‌రిపిన దాడిలో 17 మంది భ‌ద్ర‌తా సిబ్బంది ప్రాణాలు విడిచారు.

లొంగిపోయిన మావోయిస్టులంద‌రికీ త‌క్ష‌ణ సాయం కింద రూ. 50 వేల చొప్పున అంద‌జేశారు. వీరింద‌రికి ప్ర‌భుత్వం త‌ర‌పున పున‌రావాసం క‌ల్పిస్తామ‌న్నారు. మిగిలిపోయిన మావోయిస్టులు కూడా వీలైనంత త్వ‌ర‌గా లొంగిపోయి, జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో క‌ల‌వాల‌న్నారు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement