Konda Surekha Gold Rakhi | సీఎం రేవంత్ రెడ్డికి కొండా సురేఖ స్పెషల్ సర్‌ప్రైజ్.. గోల్డ్ రాఖీని కట్టిన మంత్రి
రాఖీ పండుగ వేళ సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ స్పెషల్ గోల్డ్ రాఖీ కట్టారు. ఆసక్తికరంగా ఆమె రాజకీయ వ్యాఖ్యలకు దూరంగా ఉండి వెంటనే వెళ్లిపోయారు.
- రక్షా బంధన్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క
- ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి చేయించిన 'గోల్డ్ రాఖీ'ని తీసుకువచ్చిన కొండా సురేఖ
- సీఎం అల్లుడికి, మనవడికి కూడా రాఖీ కట్టి ఆప్యాయత చాటుకున్న మంత్రి
- సీఎం నివాసంలో అంధ విద్యార్థినులు, మహిళా కమిషన్ చైర్ పర్సన్, మహిళా కాంగ్రెస్ నేతల రాఖీ వేడుకలు
Konda Surekha Gold Rakhi | త్రినేత్ర.న్యూస్ : రాఖీ పౌర్ణమి (Raksha Bandhan) పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో సందడి నెలకొంది. ఈ పండుగ వేళ మంత్రులు కొండా సురేఖ, సీతక్క కలిసి సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టి తమ సోదరభావాన్ని చాటుకున్నారు. అయితే, ఈసారి మంత్రి కొండా సురేఖ తీసుకువచ్చిన ఒక స్పెషల్ గిఫ్ట్ అక్కడున్న వారి దృష్టిని ఆకర్షించింది.

ప్రతి ఏడాదీ రేవంత్ రెడ్డికి రాఖీ కట్టడం ఆనవాయితీగా వస్తోందని మంత్రి కొండా సురేఖ మీడియా చిట్ చాట్‌లో (Chit chat) తెలిపారు. ఈ ఏడాది మరింత స్పెషల్‌గా ఉండేలా సీఎం కోసం ఆమె ప్రత్యేకంగా డిజైన్ చేయించిన 'గోల్డ్ రాఖీ' (Gold Rakhi) తీసుకువచ్చి కట్టారు. ముఖ్యమంత్రితో పాటే ఆయన అల్లుడికి, ముద్దుల మనవడికి కూడా ఆమె రాఖీలు కట్టి తన ఆప్యాయతను పంచుకున్నారు.

పండుగ వాతావరణంలో ఎలాంటి పొలిటికల్ కామెంట్స్ (Political comments) చేయనని మంత్రి స్పష్టం చేశారు. కేవలం పండుగ శుభాకాంక్షలు తెలియజేయడానికే వచ్చానని చెబుతూ, రాఖీ కట్టిన వెంటనే సీఎం నివాసం నుంచి ఆమె వెనుదిరిగారు.

మరోవైపు, మంత్రులు కొండా సురేఖ, సీతక్కతో పాటు పలువురు ప్రముఖులు సీఎంకు రాఖీ కట్టారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ గద్వాల విజయలక్ష్మి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, బ్రహ్మకుమారీ ప్రతినిధులు, మహిళా కాంగ్రెస్ నాయకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా మలక్‌పేట్‌లోని గవర్నమెంట్ హైస్కూల్ ఫర్ ది బ్లైండ్ గర్ల్స్ విద్యార్థినులు సీఎంకు రాఖీలు కట్టి మురిసిపోయారు.

రాఖీ పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ
రాఖీ కట్టి రేవంత్ రెడ్డి నివాసం నుండి వెంటనే వెనుదిరిగిన కొండా సురేఖ https://t.co/NhWIDe9Uc6 pic.twitter.com/BPhlZAbm32
— Telugu Scribe (@TeluguScribe) August 28, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్






