Delhi Metro | ఢిల్లీ మెట్రోలో అమెరికన్ యువతికి చేదు అనుభవం.. ఇకపై ఇండియాకు రాను అంటూ..
Delhi Metro | ఢిల్లీ మెట్రోలో ఇటీవల జరిగిన ఓ సంఘటన దేశ ప్రజలను నివ్వెర పోయేలా చేసింది. భారత పర్యటనకు వచ్చిన ఓ అమెరికన్ యువతికి ఢిల్లీ మెట్రోలో చేదు అనుభవం ఎదురైంది. ఫొటో తీసుకుంటానని కోరిన ఓ టీనేజ్ బాలుడు ఆ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
Delhi Metro | ఢిల్లీ మెట్రోలో ఇటీవల జరిగిన ఓ సంఘటన దేశ ప్రజలను నివ్వెర పోయేలా చేసింది. భారత పర్యటనకు వచ్చిన ఓ అమెరికన్ యువతికి ఢిల్లీ మెట్రోలో చేదు అనుభవం ఎదురైంది. ఫొటో తీసుకుంటానని కోరిన ఓ టీనేజ్ బాలుడు ఆ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే ఆ బాలుడి తల్లి, సోదరి కూడా అతను చేసిన చర్యను సమర్థించారు. పైగా ఆ యువతినే తప్పుబట్టారు. ఈ క్రమంలో ఆ సంఘటనకు తాలూకు వివరాలను ప్రొఫెసర్ గౌరవ్ సాబ్నిస్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. గౌరవ్ సాబ్నిస్ అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న స్టీవెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తుండగా, గౌరవ్‌కు భారతీయ మూలాలున్నాయి. ఈ క్రమంలో ఆ యువతి తనకు ఎదురైన ఆ సంఘటనను గౌరవ్‌తో పంచుకోగా ఆయన మొత్తం వివరాలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
ముందే హెచ్చరిక..
తన మాజీ విద్యార్థిని అయిన ఆ అమెరికన్ యువతి గతేడాది నవంబర్‌లో భారత్‌లో తన స్నేహితురాలి పెళ్లికి వెళ్లడానికి ముందు తనను సంప్రదించిందని గౌరవ్ తెలిపారు. ఈ క్రమంలో ఆమె ప్రయాణ సూచనలు అడిగిందని, కానీ ఢిల్లీ వంటి నగరాల్లో అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా లైంగిక వేధింపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లు ఆయన చెప్పారు. అయితే దురదృష్టవశాత్తూ అది నిజమైందని సాబ్నిస్ పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత ఆ యువతి భవిష్యత్తులో భారత్‌కే కాకుండా, దక్షిణాసియా దేశాలకు కూడా ప్రయాణించబోనని తనకు మెసేజ్‌లో తెలిపిందని వెల్లడించారు. తనకు పంపిన సందేశంలో ఆ యువతి ఆమెకు జరిగిన విషయాన్ని హృదయ విదారకంగా వివరించినట్లు తెలిపారు.
భారత్‌కు తిరిగి రావాలనిపించడం లేదు..
ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో ఓ 14 లేదా 15 ఏళ్ల బాలుడు తన తల్లి, సోదరితో కలిసి ఉన్నాడు. ఫొటో అడిగితే సరే అన్నాను. నా భుజంపై చేయి వేశాడు, కాస్త వింతగా అనిపించినా టీనేజర్ కదా అనుకున్నాను. కానీ ఒక్కసారిగా నా ఛాతిని బలంగా పట్టుకుని, వెనుక నుంచి కొట్టి నవ్వాడు. నాకు కోపం ఉవ్వెత్తున వచ్చి అతని కాలర్ పట్టుకుని తోసేశాను. అతను పడిపోయాడు. వెంటనే అతని తల్లి వచ్చి నేను అతిగా స్పందిస్తున్నానని, బ్లాండ్ మహిళను తొలిసారి చూసి అతను అదుపు తప్పాడని చెప్పింది. ఇది ఎలాంటి పెంపకం? నేను మీ దేశాన్ని ఎంతో ఇష్టపడ్డాను, కానీ ఇప్పుడు తిరిగి రావాలనిపించడం లేదు.. అని ఆ యువతి తనకు మెసేజ్ పంపిందని సాబ్నిస్ తెలిపారు. కాగా ఈ ఘటన వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నిందితుడి కుటుంబ సభ్యులు అతని ప్రవర్తనను సమర్థించడం నేరాన్ని ప్రోత్సహించడమేనని అనేక మంది అభిప్రాయపడ్డారు. ఇది తీవ్రమైన నేరమని, బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండాల్సిందని పలువురు సూచించారు. మరికొందరు ఆమెకు భారతీయుల తరఫున క్షమాపణలు చెప్పారు.
రాజా బేటాల వల్లే ఇదంతా..
కొంతమంది తల్లులే తమ రాజా బేటాల చెడు ప్రవర్తనకు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తుంటారు. ఇదే అత్యంత విషాదకరం.. అని కొందరు కామెంట్లు పెట్టగా, ఇది కేవలం దుర్ఘటన కాదు, గుర్తించదగిన నేరం, అతని తల్లి అతని చెవులు పట్టుకుని పోలీసుల దగ్గరకు తీసుకెళ్లాల్సింది.. అని మరికొందరు మండిపడ్డారు. ఇది అత్యంత సిగ్గుచేటు ఘటన, ఆ బాలుడు శిక్షించబడకపోవడం మరింత బాధాకరం.. అంటూ మరికొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ ఘటన భారత్‌లో మహిళల భద్రత, ముఖ్యంగా విదేశీ మహిళలు ఎదుర్కొనే సమస్యలపై మరోసారి తీవ్రమైన చర్చకు దారితీసింది. ఇటీవలే భారత్‌లో నిర్వహించిన మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నీ సందర్భంగా పలువురు ఆసీస్ ప్లేయర్లకు కూడా ఇలాంటి సంఘటనే ఎదురైంది. అయితే ఆ ఘటనలో ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ట్రీట్‌మెంట్ ఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ మెట్రోలో జరిగిన ఆ సంఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.
When this former student called me in November for suggestions for her India trip for a friend's wedding, I told her, be on guard for sexual harassment. Especially in Delhi. Here, you're just another blond. There, you'll be a target.
Sadly, came true.
Greatest culture! pic.twitter.com/LThSNG5p4r
— Gaurav Sabnis (@gauravsabnis) January 16, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






