త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India-US Trade Framework | భార‌త్‌తో బ‌ల‌ప‌డుతున్న బంధం.. క‌శ్మీర్ విష‌యంలో పాక్‌కు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చిన అమెరికా..!

D

National | Published On Feb 7, 2026, 12.07 pm IST

India-US Trade Framework | భార‌త్‌తో బ‌ల‌ప‌డుతున్న బంధం.. క‌శ్మీర్ విష‌యంలో పాక్‌కు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చిన అమెరికా..!
Advertisement

India-US Trade Framework | భార‌త్‌-అమెరికా మ‌ధ్య కీల‌క‌మైన మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖ‌రారైన విష‌యం తెలిసిందే. దీనిపై ఇరు దేశాలు ఇవాళ సంయుక్త ప్ర‌క‌ట‌న చేశాయి. ఇక ఈ డీల్ వేళ (India-US Trade Deal) భార‌తదేశ చిత్ర‌ప‌టాన్ని అగ్ర‌రాజ్యం రిలీజ్ చేసింది. భారత్-అమెరికా మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందం చట్రం (India-US Trade Framework)లో భార‌త్ చిత్ర‌ప‌టాన్ని యూఎస్ ట్రేడ్ రెప్ర‌జెంటేటివ్ ఆఫీస్ తాజాగా విడుద‌ల చేసింది. ఈ మ్యాప్‌లో ఉత్త‌ర కేంద్ర‌పాలిత ప్రాంత‌మైన జ‌మ్ము క‌శ్మీర్‌ను భార‌త్‌లో భాగంగా చూపించింది. అంతేకాదు పాకిస్థాన్ చ‌ట్ట‌విరుద్ధంగా ఆక్ర‌మించిన పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్ (Kashmir ) కూడా ఈ మ్యాప్‌లో ఉండ‌టం విశేషం.

పాక్‌కు స్ట్రాంగ్ మెసేజ్‌

జ‌మ్ము క‌శ్మీర్ విష‌యంలో భార‌త్‌-పాక్ మ‌ధ్య చాలా ఏళ్లుగా వివాదం న‌డుస్తోంది. ఈ వివాదం వేళ పాక్‌కు అత్యంత విశ్వ‌స‌నీయ మిత్ర‌దేశాల్లో ఒక‌టైన అమెరికా క‌శ్మీర్‌ను భార‌త్‌లో భాగంగా చూపించి దాయాదికి బిగ్ షాకిచ్చింది. ఈ ఒక్క మ్యాప్‌తో కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగంగా ఆమోద ముద్ర వేసింది. పాకిస్థాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించిన పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ భారతదేశంలో భాగంగా అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం ఒక ఫొటోను విడుదల చేసింది. దీనిపై ప‌లువురు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ మ్యాప్‌తో దాయాదికి అమెరికా స్ట్రాంగ్ సందేశం పంపిందంటూ (US sends strong message to Pakistan) అభిప్రాయ‌ప‌డుతున్నారు.

బ‌ల‌ప‌డుతున్న బంధం..

ఏడాది కాలంగా దెబ్బ‌తిన్న భార‌త్‌-అమెరికా మ‌ధ్య సంబంధాలు మ‌ళ్లీ బ‌ల‌ప‌డుతున్నాయి. ట్రంప్‌ అధిక సుంకాల బాదుడుతో ఇరు దేశాల మ‌ధ్య దౌత్య‌సంబంధాలు దెబ్బ‌తిన్న విష‌యం తెలిసిందే. దీంతో ఇరుదేశాల మ‌ధ్య కీల‌క‌మైన ట్రేడ్ డీల్ కూడా నిలిచిపోయింది. అయితే, తాజాగా ట్రంప్‌-మోదీ మ‌ధ్య జ‌రిగిన ఫోన్ సంభాష‌ణ‌తో ప‌రిస్థితులు మారిపోయాయి. ఈ ఫోన్ కాల్‌తో ఎన్నో రోజులుగా కొలిక్కిరాని ట్రేడ్ డీల్ కూడా ఓకే అయింది. ఇరు దేశాల మ‌ధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖ‌రారైంది. ఈ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్ర‌కారం.. భార‌తీయ వ‌స్తువుల‌పై 50 శాతం ఉన్న సుంకాన్ని (tariffs) 18 శాతానికి త‌గ్గించిన‌ట్లు అమెరికా ప్ర‌క‌టించింది. ఫ‌లితంగా రెండు దేశాల మ‌ధ్య సంబంధాలు మ‌ళ్లీ స్ట్రాంగ్ అయ్యాయి.

Advertisement
Advertisement