KTR | అంతర్జాతీయ వేదికపై రాజకీయ నాటకాలు తగవు.. యూత్ కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ చురక
KTR | భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ (India AI Impact Summit)లో యూత్ కాంగ్రెస్ నేతలు నిరసన తెలపడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికపై రాజకీయ నాటకాలు తగవని మండిపడ్డారు.
KTR | త్రినేత్ర.న్యూస్: భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ (India AI Impact Summit)లో యూత్ కాంగ్రెస్ నేతలు నిరసన తెలపడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికపై రాజకీయ నాటకాలు తగవని మండిపడ్డారు. ఎక్కడ.. ఎలా నిరసన తెలపాలో అర్థం చేసుకోవాలని హితవు పలికారు. రాజకీయ అసమ్మతిని వ్యక్తం చేయడానికి ఒక సమయం, సందర్భం ఉంటాయంటూ ఎక్స్ వేదికగా సూచించారు.
‘అంతర్జాతీయ వేదికలపై రాజకీయ నాటకాలు తగవు. యూత్ కాంగ్రెస్ నేతలు తమ అల్ప రాజకీయ నాటకాల కోసం ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026ను వేదికగా ఎంచుకోవడం విచారకరం. ఇలాంటి అంతర్జాతీయ వేదికలను నిరసనల కోసం ఉపయోగించడంతో ప్రపంచ దేశాల ముందు భారత్ ప్రతిష్ట దెబ్బతింటుంది.
ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజం. కానీ ఎక్కడ, ఎలా నిరసన తెలపాలో అర్థం చేసుకోవడం ముఖ్యం. రాజకీయ అసమ్మతిని వ్యక్తం చేయడానికి ఒక సమయం, సందర్భం ఉంటాయి. ఏఐ సమ్మిట్ వంటి అంతర్జాతీయ సదస్సు ఖచ్చితంగా దానికి వేదిక కాదు. వారి సొంత పార్టీ సీఎం రేవంత్ రెడ్డి అదే ఏఐ సదస్సులో ప్రసంగిస్తున్న సమయంలోనే యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టడం విచిత్రంగా ఉంది’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్‌ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్‌ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



