త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amarnath Yatra | అమ‌ర్‌నాథ్ యాత్రకు వెళ్తారా..? నేటి నుంచే రిజిస్ట్రేష‌న్ షురూ..!

Amarnath Yatra | అమర్‌నాథ్ యాత్రకు అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జమ్మూ అండ్ క‌శ్మీర్ బ్యాంక్, యెస్ బ్యాంక్‌కు చెందిన 556 గుర్తించిన శాఖల్లో పేర్ల న‌మోదు కోసం సదుపాయం కల్పించారు.

P

National | Published On Apr 15, 2026, 7.19 am IST

Amarnath Yatra | అమ‌ర్‌నాథ్ యాత్రకు వెళ్తారా..? నేటి నుంచే రిజిస్ట్రేష‌న్ షురూ..!
Advertisement

Amarnath Yatra | అమర్‌నాథ్ యాత్రకు అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జమ్మూ అండ్ క‌శ్మీర్ బ్యాంక్, యెస్ బ్యాంక్‌కు చెందిన 556 గుర్తించిన శాఖల్లో పేర్ల న‌మోదు కోసం సదుపాయం కల్పించారు. అలాగే అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్ నమోదు కూడా అందుబాటులో ఉంటుంది. అమర్‌నాథ్ షెరైన్ బోర్డు వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘మొదట వచ్చిన వారికి ముందుగా’ (ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్) విధానంలో నమోదు జరుగుతుంది. బ‌ల్తాల్‌, పహల్గామ్ మార్గాల ద్వారా యాత్రకు రోజువారీ కోటాలను నిర్ణయించారు. 13 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల భక్తులు యాత్రకు అర్హులు. ఆరు వారాలకు పైగా గర్భిణులు యాత్రలో పాల్గొనేందుకు అనుమ‌తి ఉండ‌దు.

ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధ్రువీక‌ర‌ణ‌తో రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ జ‌రుగుతుంది. అనుమతిపత్రాలు ఆన్‌లైన్‌లో జారీ చేయ‌నున్నారు. యాత్రికులు గుర్తింపు పొందిన వైద్య సంస్థలు జారీ చేసిన ఆరోగ్య ధ్రువీక‌ర‌ణ‌ప‌త్రాన్ని సైతం స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ట్రావెల్ పర్మిట్‌లో ఎంపిక చేసిన మార్గం (బ‌ల్తాల్‌, పహల్గామ్) ప్రయాణ తేదీ వివరాలు ఉంటాయి. ఇదిలా ఉండ‌గా.. జమ్మూ నగరంలో ఎనిమిది ప్రదేశాల్లో రిజిస్ట్రేష‌న్ కేంద్రాల‌ను అధికారులు ఏర్పాటు చేశారు. బ్యాంకు శాఖల్లో భక్తులకు ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. జమ్మూలో బక్షీ నగర్, రెసిడెన్సీ రోడ్, అఖ్నూర్ రోడ్, గాంధీ నగర్ గోల్ మార్కెట్, ఛన్నీ హిమ్మత్‌లో జేకే బ్యాంక్ శాఖలు, హరి మార్కెట్‌లో ఎస్బీఐ శాఖలో నమోదు సదుపాయం కల్పించారు.

ఇతర ప్రాంతాల్లో కూడా నమోదు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కథువాలో కాలేజ్ రోడ్‌లో పీఎన్‌బీ శాఖ, బిల్లావర్ మెయిన్ మార్కెట్‌లో జేకే బ్యాంక్, కిష్త్వార్‌లో షాహీన్ కాంప్లెక్స్, బస్ స్టాండ్ సమీపంలో ఓం మెహతా రోడ్ జేకే బ్యాంక్ శాఖల్లో నమోదు జరుగుతుంది. పూంచ్‌లో మెయిన్ మార్కెట్ గురుద్వారా సింగ్ సభ వద్ద జేకే బ్యాంక్, రాంబన్ మెయిన్ బజార్, బటోటే పోలీస్ స్టేషన్ ఎదురుగా జేకే బ్యాంక్, ఎస్బీఐ శాఖల్లో కూడా సదుపాయం ఉంది. రాజౌరీ మెయిన్ బజార్, సుందర్‌బాని మెయిన్ బజార్ ప్రాంతాల్లో జేకే బ్యాంక్ శాఖల్లో నమోదు కొనసాగుతుంది. రియాసీ జిల్లాలో కత్రా అంబికా హోటల్ వద్ద పీఎన్‌బీ శాఖ, మెయిన్ బజార్ పీఎన్‌బీ, బస్ స్టాండ్ కత్రాలో జేకే బ్యాంక్ శాఖల్లో నమోదు జరుగుతుంది.

సాంబాలో నైనిటాల్ హైవే వార్డ్ నం.2లో పీఎన్‌బీ, జాతీయ రహదారిపై ఎస్బీఐ శాఖల్లో సదుపాయం ఉంది. శ్రీనగర్ కరణ్ నగర్ గోల్ మార్కెట్‌లో జేకే బ్యాంక్, ఉదంపూర్‌లో శివ్ నగర్ ప్రధాన శాఖ, కోర్టు సముదాయం ఎదురుగా ఉన్న జేకే బ్యాంక్ శాఖల్లో కూడా నమోదు కేంద్రాలు ఏర్పాటు చేశారు. డోడాలో భద్రవాహ్ సేరి బజార్‌లో జేకే బ్యాంక్, డీసీ కార్యాలయం సమీపంలో ఎస్బీఐ శాఖలో నమోదు జరుగుతుంది. అనంత్‌నాగ్‌లో సీఆర్‌పీఎఫ్ క్యాంప్ సమీపంలోని మీర్ బజార్ జేకే బ్యాంక్, పుల్వామాలో హాల్ వద్ద జేకే బ్యాంక్ శాఖల్లో కూడా యాత్ర నమోదు కొనసాగుతుంది.

Advertisement
Advertisement