Tony Abbott | భారత్ విషయంలో ట్రంప్ విదేశాంగ విధానాన్ని తప్పుపట్టిన ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్..!
Tony Abbott | ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. భారత్‌ను తక్కువగా చూడటం, పాకిస్తాన్‌ను కీలక భాగస్వామిగా ప్రాధాన్యం ఇవ్వడం ఒక పెద్ద తప్పిదమన్నారు. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌లకు వైట్‌హౌస్‌లో మునీర్‌కు ఆతిథ్యం ఇవ్వడం, భారత్‌కి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌కు ప్రాధాన్యం సరికాదని అబాట్ పేర్కొన్నారు. మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ట్రంప్ విదేశాంగ విధానానికి తాను అభిమానిని కాదన్నారు. భారత్‌తో సంబంధాలను అనవసరంగా దూరం చేసుకున్నారని.. భారత ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించడం, భారత్-పాక్ మధ్య వివాదాన్ని అమెరికా పరిష్కరించినట్లు చెప్పడం, పాక్ ఆర్మీ చీఫ్‌ను వైట్‌హౌస్‌లో ఆహ్వానించడంతో భారత్ అసంతృప్తికి దారితీసాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందాన్ని ట్రంప్ ప్రకటించారు. ఒప్పందం ప్రకారం భారత్ ఉత్పత్తులపై విధించిన సుంకాలను తగ్గించారు. అమెరికా భారత వస్తువులపై 25 శాతం పరస్పర సుంకాలు విధించడంతో పాటు, రష్యా చమురు కొనుగోళ్లకు సంబంధించి అదనంగా మరో 25 శాతం పన్ను కూడా విధించింది. అయితే, ప్రధాని మోదీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్నంత కాలం మాస్కో నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేస్తామని హామీ ఇచ్చిన తర్వాతే ఈ సుంకాలు తగ్గించామని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఒప్పందంతో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు కొంత మేర తగ్గాయి. మధ్యప్రాచ్య పరిస్థితులపై కూడా అబాట్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇరాన్‌లో పాలన మారుతుందా అని ప్రశ్నించగా.. ప్రస్తుత పాలక వర్గానికి ప్రజల్లో ఇంకా మద్దతు ఉందని, ఇరాన్ అణు కార్యక్రమం దశాబ్దాల వెనక్కి వెళ్లిందని, యుద్ధం తీవ్రత క్రమంగా తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆయన చెప్పినట్లే, ఇప్పటికే ఇరాన్ దాడుల తీవ్రత తగ్గిందని, మరోవైపు ఇజ్రాయెల్-అమెరికా దాడులు ప్రధానంగా ఇరాన్ ప్రభుత్వ సైనిక స్థావరాలపై దృష్టి సారించాయని, దేశ ఆర్థిక, సామాజిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్న దాడులు జరగలేదని తెలిపారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






