త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ali Khamenei Visited Alipura | 1986లో కర్ణాటకలో పర్యటించిన ఖమేనీ.. ఎందుకంటే?

అలిపురాలో ఉన్న జనాభా సుమారు 25 వేలు. అందులో 90 శాతం మంది షియా ముస్లింలు. అలిపురాను మినీ ఇరాన్ అని కూడా పిలుస్తారు. అందుకే అక్కడి ముస్లింల రిక్వెస్ట్ మేరకు అప్పట్లో ఆ గ్రామాన్ని పర్యటించి అక్కడి మత పెద్దలతో సమావేశమయ్యారు.

J

National | Published On Mar 1, 2026, 7.57 pm IST

Ali Khamenei Visited Alipura | 1986లో కర్ణాటకలో పర్యటించిన ఖమేనీ.. ఎందుకంటే?
Advertisement

Ali Khamenei Visited Alipura | ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి గురించే చర్చ. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి సంయుక్తంగా ఇరాన్‌పై చేసిన దాడిలో అలీ ఖమేనీ మృతి చెందినట్లు ఇరాన్ ప్రకటించింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్.. గల్ఫ్ దేశాలపై బాంబులతో విరుచుకుపడుతోంది. ఈనేపథ్యంలో అలీ ఖమేనీ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకప్పుడు యువకుడిగా ఉన్నప్పుడు అలీ ఖమేనీ భారత్‌లో పర్యటించారు. కర్ణాటకలోని అలిపురాలో 1986లో ఆయన పర్యటించారు. చిక్కబళ్లాపూర్ జిల్లాలో ఉంటుంది ఈ ఊరు. అందుకే ఆయన మృతికి సంతాపంగా ఆ ఊరు మొత్తం ఇప్పుడు శోకసంద్రంలో మునిగింది. ఖమేనీ మృతికి నిరసనగా అక్కడ ముస్లింలు ర్యాలీ చేశారు.

అసలు అలిపురాలో ఖమేనీ ఎందుకు పర్యటించారు.. అంటే అలిపురాలో ఉన్న జనాభా సుమారు 25 వేలు. అందులో 90 శాతం మంది షియా ముస్లింలు. అలిపురాను మినీ ఇరాన్ అని కూడా పిలుస్తారు. అందుకే అక్కడి ముస్లింల రిక్వెస్ట్ మేరకు అప్పట్లో ఆ గ్రామాన్ని పర్యటించి అక్కడి మత పెద్దలతో సమావేశమయ్యారు. 1989లో ఖమేలీ సుప్రీం లీడర్‌గా ఎదిగారు. అంతకుముందే ఆయన భారత్‌లో పర్యటించి షియా ముస్లింల మద్దతును కూడగట్టుకున్నారు. ఇప్పటికీ అలిపురా నుంచి ఇరాన్‌కు చాలామంది విద్యార్థులు వెళ్లి టెహ్రాన్, మషాద్‌లో ఉన్న యూనివర్సిటీలలో చదువుతున్నారు.

https://x.com/khamenei_ir/status/1226890763532931075

Advertisement
Advertisement