Airfares Surge for Holi | హోలీ పండుగ ఎఫెక్ట్.. విమాన ధరలకు రెక్కలు
పండుగ సమయాల్లోనే ఒక్కసారిగా ఎయిర్ చార్జీలు పెంచడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే తంతు సాగుతోందని జస్టిస్ విక్రమ్ నాథ్‌తో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.
Airfares Surge for Holi | మార్చి 4న హోలీ పండుగను దేశవ్యాప్తంగా ప్రజలంతా జరుపుకోనున్నారు. ఈనేపథ్యంలో హోలీ పండుగను ఇంటికి వెళ్లి తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి జరుపుకోవాలని అనుకున్న చాలామందికి ఎయిర్‌లైన్స్ సంస్థలు షాకిచ్చాయి. ఎందుకంటే హోలీ పండుగ సందర్భంగా విమాన ధరలు భారీగా పెరిగాయి. ఫిబ్రవరి లాస్ట్ వీక్ నుంచి మార్చి ఫస్ట్ వీక్ వరకు డొమెస్టిక్ రూట్లలో భారీగా ధరలను పెంచారు. అది కూడా 10 శాతమో 20 శాతమో కాదు.. ఒక రూట్‌లో అయితే ఏకంగా 185 శాతం పెంచారు. దీంతో హోలీ పండుగను తమ సొంతూరుకు వెళ్లి జరుపుకోవాలని అనుకునే వాళ్ల పాకెట్ ఖాళీ కానుంది.
మధ్య తరగతి ప్రజలు డొమెస్టిక్ రూట్‌లో రూ.20 వేలు పెట్టి విమాన టికెట్ కొంటారా? మామూలుగా రూ.7 వేలు ఉండే టికెట్‌ను రూ.20 వేలకు అమ్ముతున్నారు. అంత డబ్బు పెట్టి టికెట్ కొనే స్థోమత చాలామందికి ఉండదు. బెంగళూరు, ముంబై, వారణాసి, గోరఖ్‌పూర్, ఢిల్లీ, చెన్నై లాంటి నగరాలకు వెళ్లాలనుకునే వాళ్లు విమాన ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. పోనీ.. రైళ్లలో వెళ్దామంటే ఇప్పటికే రైళ్లు అన్నీ ఫుల్ అయ్యాయి. బస్సులు కూడా ఫుల్. విమాన ధరలు చూస్తే రెక్కలు వచ్చాయి అంటూ ఓ వ్యక్తి ఎక్స్‌లో తన బాధను వెళ్లగక్కాడు.
గత పది పదిహేను రోజుల నుంచి విమాన చార్జీలను చూస్తున్నా. రాకెట్‌లా దూసుకుపోతున్నాయి. ఫెస్టివల్ అంటే మనుషులను కలపాలి కానీ.. ఇలా ప్రయాణం అంటేనే భయపడిపోయేలా చేస్తున్నాయి ఎయిర్‌లైన్స్ అంటూ మరో వ్యక్తి ట్వీట్ చేశాడు.
హోలీ, దివాళీకి ధరల పెంపు కామనే
నిజానికి హోలీ, దివాళీ లాంటి పండుగలకు విమాన ధరలు పెరగడం కామనే. ఎందుకంటే ఈ రెండు పండుగలే దేశవ్యాప్తంగా ఎక్కువ శాతం మంది ప్రజలు జరుపుకుంటారు. అందుకే ఈ పండుగల సమయంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు తమ కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు చేసుకోవాలనుకుంటారు. కానీ.. ఇదే అదునుగా భావించి ఎయిర్‌లైన్స్ కూడా ధరలను విపరీతంగా పెంచేస్తుంటాయి.
సుప్రీంకోర్టు సీరియస్
పండుగ సమయాల్లోనే ఒక్కసారిగా ఎయిర్ చార్జీలు పెంచడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే తంతు సాగుతోందని జస్టిస్ విక్రమ్ నాథ్‌తో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఎయిర్ చార్జీల పెంపుపై దాఖలైన పలు పిటిషన్లపై నాలుగు వారాల్లో నివేదికతో కూడిన అఫిడవిట్‌ని సమర్పించాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. దీనికి సంబంధించిన విచారణ మార్చి 23న సుప్రీంలో జరగనుంది.
సంబంధిత వార్తలు

Ola Electric | హోలీ సందర్బంగా ఓలా ఎలక్ట్రిక్ ఆఫర్లు.. టూవీలర్లపై తగ్గింపు ధరలు..
మార్చి 3, 2026

Venus constellation Transit | పూర్వ భాద్రపద నక్షతంలోకి శుక్రుడు.. ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్..!
మార్చి 2, 2026

Holi Health Tips | హోలీ వేడుకల్లో నీటితో జాగ్రత్త.. వ్యాధులు ప్రబలే అవకాశం.. వైద్యుల సూచనలు..
ఫిబ్రవరి 28, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



