త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ola Electric | హోలీ సంద‌ర్బంగా ఓలా ఎల‌క్ట్రిక్ ఆఫ‌ర్లు.. టూవీల‌ర్ల‌పై త‌గ్గింపు ధ‌ర‌లు..

Ola Electric | ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్ సంస్థ ఓలా ఎల‌క్ట్రిక్ హోలీ పండుగ సంద‌ర్భంగా హోలీ మ‌హోత్స‌వ్ పేరిట ప్ర‌త్యేక ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. ఓలా ఎల‌క్ట్రిక్‌కు చెందిన రోడ్‌స్ట‌ర్ సిరీస్ టూవీల‌ర్ల‌ను రూ.79,999 ప్రారంభ ధ‌ర‌కు విక్ర‌యిస్తున్న‌ట్లు తెలిపింది. ఈ క్ర‌మంలో ఎంట్రీ లెవల్ పెట్రోల్ టూవీల‌ర్ల‌కు స‌మాన‌మైన ధ‌ర‌ల‌ను ప్ర‌స్తుతం పొంద‌వ‌చ్చని ఆ సంస్థ తెలిపింది.

S

Business | Published On Mar 3, 2026, 4.01 pm IST

Ola Electric | హోలీ సంద‌ర్బంగా ఓలా ఎల‌క్ట్రిక్ ఆఫ‌ర్లు.. టూవీల‌ర్ల‌పై త‌గ్గింపు ధ‌ర‌లు..
Advertisement

Ola Electric | ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్ సంస్థ ఓలా ఎల‌క్ట్రిక్ హోలీ పండుగ సంద‌ర్భంగా హోలీ మ‌హోత్స‌వ్ పేరిట ప్ర‌త్యేక ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. ఓలా ఎల‌క్ట్రిక్‌కు చెందిన రోడ్‌స్ట‌ర్ సిరీస్ టూవీల‌ర్ల‌ను రూ.79,999 ప్రారంభ ధ‌ర‌కు విక్ర‌యిస్తున్న‌ట్లు తెలిపింది. ఈ క్ర‌మంలో ఎంట్రీ లెవల్ పెట్రోల్ టూవీల‌ర్ల‌కు స‌మాన‌మైన ధ‌ర‌ల‌ను ప్ర‌స్తుతం పొంద‌వ‌చ్చని ఆ సంస్థ తెలిపింది. రోడ్‌స్ట‌ర్ సిరీస్‌లో మూడు వేరియెంట్లు అందుబాటులో ఉండ‌గా, అన్నింటిపై కూడా త‌గ్గింపు ధ‌ర‌ను అందిస్తోంది.

ఈ మోడ‌ల్స్‌పై తగ్గింపు ధ‌ర‌లు..

ఓలా రోడ్‌స్ట‌ర్ ఎక్స్ సిరీస్ ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్ల‌లో 2.5 kWh సామ‌ర్థ్యం క‌లిగిన బేస్ మోడ‌ల్ ధ‌ర త‌గ్గింపు అనంతరం ప్ర‌స్తుతం రూ.79,999 ఉండ‌గా, 3.5kWh సామ‌ర్థ్యం క‌లిగిన మ‌రో వేరియెంట్ ధ‌ర రూ.92,999గా ఉంది. అలాగే 4.5kWh కెపాసిటీ కలిగిన టాప్ మోడ‌ల్ ధ‌ర‌ను రూ.99,999గా నిర్ణ‌యించారు.

ఓలా రోడ్‌స్ట‌ర్ ఎక్స్ ప్ల‌స్ మోడ‌ల్ కూడా త‌గ్గింపు ధ‌ర‌ల‌కు అందుబాటులో ఉంద‌ని ఆ సంస్థ తెలిపింది. ఇది రెండు మోడ‌ల్స్‌లో ల‌భిస్తోంది. 4.5kWh కెపాసిటీ కలిగిన మోడ‌ల్ ధ‌ర త‌గ్గింపు అనంత‌రం ప్ర‌స్తుతం రూ.1,09,999 ధ‌ర‌కు ల‌భిస్తుండ‌గా, 9.1kWh కెపాసిటీ క‌లిగిన టాప్ మోడ‌ల్ ధ‌ర రూ.1,89,000గా ఉంది.

రెండు రోజులే ఆఫ‌ర్‌..

హోలీ ఆఫర్లలో భాగంగా కంపెనీ ముహూర్త్ మహోత్సవ్ ను ప్రకటించింది. మంగ‌ళ‌, బుధవారం మాత్రమే అమల్లో ఉండే ఈ ఆఫర్‌లో ప్రత్యేకంగా 90 నిమిషాల శుభ ముహూర్త్ సమయాల్లో పరిమిత యూనిట్ల‌ను ప్రత్యేక ధరకు అందిస్తారు. ఆ ధరలు లైవ్ విండో సమయంలోనే ప్రకటించబడతాయని కంపెనీ వెల్లడించింది. అదనంగా S1 Pro (3 kWh, 4 kWh), S1 Pro+ (4 kWh) మోడళ్లపై 8 ఏళ్ల ఎక్స్‌టెండెడ్ వారంటీని కూడా వినియోగదారులు పొందవచ్చని తెలియ‌జేసింది. ఈ సంద‌ర్భంగా కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ ఈ హోలీకి రోడ్‌స్టర్ ధర రూ. 79,999 నుంచి ప్రారంభమవుతుండటంతో ఎలక్ట్రిక్ టూవీల‌ర్లు ఇక ప్రీమియం కావ‌ని అన్నారు. పెట్రోల్ మోటార్‌సైకిల్స్‌కు స‌మానంగా ఇప్పుడు ధ‌ర‌లు ఉన్నాయ‌ని తెలిపారు.

ఇటీవల కంపెనీ దేశవ్యాప్తంగా ఉన్న 10 లక్షలకుపైగా వినియోగదారుల కోసం Ola Insiders అనే ప్రత్యేక కమ్యూనిటీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. హోలీ మహోత్సవ్ సందర్భంగా ఈ కమ్యూనిటీ సభ్యులకు ఇప్పటికే ఉన్న ప్రయోజనాలపై అదనంగా రూ. 5వేల‌ విలువైన బెనిఫిట్‌ను ముహూర్త్ మహోత్సవ్ విండోలో అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.

Advertisement
Advertisement