Air Force Chief US Visit | యూఎస్ పర్యటనలో ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మార్షల్.. ఎఫ్-15ఈఎక్స్ ఫైటర్ జెట్‌లో ప్రయాణం..!
Air Force Chief US Visit | భారత వైమానిక దళం చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ అమెరికా పర్యటనలో భాగంగా నెవాడాలోని నెల్లిస్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. బోయింగ్ ఎఫ్-15ఈఎక్స్ ఈగిల్ 2 యుద్ధ విమానంలో ప్రయాణించారు.
Air Force Chief US Visit | భారత వైమానిక దళం చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ అమెరికా పర్యటనలో భాగంగా నెవాడాలోని నెల్లిస్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. బోయింగ్ ఎఫ్-15ఈఎక్స్ ఈగిల్ 2 యుద్ధ విమానంలో ప్రయాణించారు. ఆయన వెంట యూఎస్ వైమానిక దళ మేజర్ మాథ్యూ బెన్సన్ ఉన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రత విషయంలో ఈ విమానం కీలకంగా పేర్కొంటున్నారు. ఎఫ్-15ఈఎక్స్ ఈగిల్ 2 విమానం యూఎస్‌లోని అధునాతన యుద్ధ విమానాల్లో ఒకటిగా భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఎయిర్ చీఫ్ మార్షల్ యూఎస్ వైమానిక దళ వార్ సెంట్రల్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ డేవిడ్ సీ ఎప్పర్సన్‌తో సహా పలువురు సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు.
భారత ప్రతినిధి బృందంలో ఎయిర్ కమోడోర్ యశ్‌పాల్ సింగ్ నేగి సైతం ఉన్నారు. ఇరుదేశాల వైమానిక దళాల సంయుక్త విన్యాసాలకు అవకాశాలను పెంచడం, ఆధునికీకరణ ప్రయత్నాలపై సమన్వయంపై చర్చించారు. భారత్, అమెరికాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని అధికారులు నొక్కి చెప్పారు. సంయుక్త కార్యకలాపాల్లో మెరుగైన సమన్వయం, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కలిసి పనిచేయడంపై దృష్టి సారించాలని సూచించారు. ఈ సహకారం భవిష్యత్తులో ఇరు దేశాల సైనిక బలగాలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడంలో సహాయపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎఫ్-15ఈఎక్స్ ఈగిల్ 2 విమానం గురించి..
ఎఫ్-15ఈఎక్స్ ఈగిల్ 2 విమానం గంటకు మాక్ 2.5 వరకు వేగంతో దూసుకెళ్తుంది. 50వేల అడుగుల ఎత్తు వరకు ఎగరగల సామర్థ్యం ఉంది. సుమారు 13,381 కిలోగ్రాముల పేలోడ్‌ను మోసుకెళ్తుంది. ఇందులో డిజిటల్ ఫ్లై-బై-వైర్ నియంత్రణలు, అధునాతన మిషన్ వ్యవస్థలు, అధునాతన రాడార్ (ఏఈఎస్ఏ) ఫీచర్లు ఉన్నాయి. ఈ విమానం ఒకేసారి 12 ఆమ్రామ్ క్షిపణులను మోసుకెళ్తుంది. హైపర్‌సోనిక్ ఆయుధాలకు సైతం సపోర్ట్ ఇస్తుంది.
ఎయిర్ చీఫ్ మార్షల్ యూఎస్ పర్యటనలో భాగంగా పెంటగాన్‌కు చేరుకున్నారు. ఆయనకు యూఎస్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ జనరల్ కెన్ విల్స్‌బాచ్ ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా యూఎస్ వైమానిక దళ కార్యదర్శి ట్రాయ్ మింక్, జనరల్ విల్స్‌బాచ్‌లతో ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొన్నారు. ఆయా సమావేశాల్లో యూఎస్ నేతలు భారత్‌తో రక్షణ భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇచ్చారు. స్వేచ్ఛాయుత, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ పాత్రను గురించారు. ప్రాంతీయ భద్రతకు సహకారం అవసరమని జనరల్ విల్స్‌బాచ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో భారత్ ఎంక్యూ-9బీ స్కై గార్డియన్ విమానాల కొనుగోలు అంశంపై సైతం చర్చించారు. విమానాల మోహరింపులో భారత సాయుధ దళాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని యూఎస్ హామీ ఇచ్చింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






