AIIMS Study | చిన్నారుల చేతిలో ఫోన్‌తో ప్రమాద ఘంటికలు..! ఏయిమ్స్ స్టడీలో కీలక విషయాలు..
AIIMS Study | ప్రస్తుత డిజిటల్ యుగంలో స్క్రీన్ టైమ్ విపరీతంగా పెరిగింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వరకూ అందరూ ఫోన్ల సహా పలు డిజిటల్ గ్యాడ్జెట్స్‌లోనే మునిగిపోతున్నారు. అయితే, ఏడాదిలోపు పిల్లల్లో అధికంగా స్క్రీన్ టైమ్ ఉండడం వల్ల మూడేళ్ల వరకు ఆటిజం లక్షణాల ప్రమాదం పెరుగుతున్నట్లు ఎయిమ్స్ ఢిల్లీ నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది.
- ఏడాదిలోపు పిల్లల్లో హై స్క్రీన్ టైమ్‌తో ఆటిజం
- చిన్నారుల మెదడుపై తీవ్ర ప్రభావం
- నిద్రలేమి, ఊబకాయం సమస్యలు
- నాడీ వ్యవస్థ అభివృద్ధిపై ప్రభావం
AIIMS Study | ప్రస్తుత డిజిటల్ యుగంలో స్క్రీన్ టైమ్ విపరీతంగా పెరిగింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వరకూ అందరూ ఫోన్ల సహా పలు డిజిటల్ గ్యాడ్జెట్స్‌లోనే మునిగిపోతున్నారు. అయితే, ఏడాదిలోపు పిల్లల్లో అధికంగా స్క్రీన్ టైమ్ ఉండడం వల్ల మూడేళ్ల వరకు ఆటిజం లక్షణాల ప్రమాదం పెరుగుతున్నట్లు ఎయిమ్స్ ఢిల్లీ నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. చిన్న వయస్సులోనే డిజిటల్ డివైజెస్‌కు ఎక్కువగా అలవాటు చేయడం వల్ల ఆటిజం సంబంధిత సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు పేర్కొంటున్నారు.
ఆటిజం లక్షణాలు..

అధ్యయనం ప్రకారం.. ఏడాది లోపు పిల్లలు ఎక్కువ సమయం మొబైల్, టీవీ వంటి స్క్రీన్‌లను చూసే పరిస్థితి ఉంటే.. వారికి మూడేళ్ల వయస్సు వచ్చేవరకు నేరుగా కళ్లల్లోకి చూడకపోవడం, పిలిచినా పలకకపోవడం, ఒంటరిగా ఉండడం, ఒకే పనిని మళ్లీ మళ్లీ చేయడం, మాటలు రావడంలో ఆలస్యం కావడం, శబ్దాలకు, స్పర్శకు తీవ్రంగా ప్రతిస్పందించడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా మగపిల్లలో ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తున్నట్లు అధ్యయనంలో గుర్తించారు. ఏడాది వయస్సులో ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉన్న పిల్లల్లో, మూడు సంవత్సరాల నాటికి ఆటిజం స్పెక్ట్రం డిసార్డర్ (ASD) లక్షణాలు ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని పరిశోధకులు గమనించారు. అలాగే, రోజుకు ఒక గంటకు మించిన స్క్రీన్ వినియోగం కారణంగా పిల్లల మెదడు అభివృద్ధి, సామాజిక నైపుణ్యం, భాషా సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. దాంతో పాటు నిద్రలేమి, ఊబకాయం వంటి సమస్యలు కూడా పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఏం చేయాలంటే..?
ఈ నేపథ్యంలో నిపుణులు కీలక సూచనలు చేశారు. 18 నెలల లోపు పిల్లలకు పూర్తిగా స్క్రీన్ దూరంగా ఉంచాలని, అత్యవసర పరిస్థితుల్లో కుటుంబ సభ్యులతో వీడియో కాల్స్‌కు మాత్రమే పరిమితం చేయాలని సూచించారు. స్క్రీన్ టైమ్‌కు బదులుగా పిల్లలతో కలిసి ఆడుకోవడం, మాట్లాడడం, కమ్యూనికేషన్ చేసుకునేలా ప్రోత్సహించడంతో సమస్యలు తగ్గించవచ్చని పేర్కొన్నారు. ఎయిమ్స్ పీడియాట్రిక్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ షెఫాలి గులాటి మాట్లాడుతూ చిన్న వయస్సులో డిజిటల్ పరికరాల వాడకంతో పిల్లల నాడీ వ్యవస్థ అభివృద్ధిపై ప్రభావం చూపుతుందని తెలిపారు. స్క్రీన్ వినియోగంపై తల్లిదండ్రులు కట్టుదిట్టమైన నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ అధ్యయనాలకు ఈ పరిశోధన అనుగుణంగానే ఉండటం గమనార్హం. చిన్నారుల డిజిటల్ అలవాట్లు వారి మానసిక, నాడీ అభివృద్ధిపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతున్నాయని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.
A key finding from AIIMS New Delhi research highlights that increased screen time in children under one year of age is associated with a higher risk of autism by the age of three.
The study suggests that greater screen exposure may increase the likelihood of autism-related… pic.twitter.com/U3Ubmhedek
— DD News (@DDNewslive) May 1, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






