AIADMK-BJP Alliance | తమిళనాడు అన్నాడీఎంకే-బీజేపీ మధ్య కుదిరిన పొత్తు..!
AIADMK-BJP Alliance | తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నది. పోలింగ్‌కు నెల రోజుల సమయం మిగిలి ఉంది. ఈ క్రమంలో పలు పార్టీలు పొత్తులపై చర్చలు జరుపుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్ష అన్నాడీఎంకే (AIADMK) పార్టీతో కలిసి బీజేపీ పోటీ చేయనుంది.
AIADMK-BJP Alliance | తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నది. పోలింగ్‌కు నెల రోజుల సమయం మిగిలి ఉంది. ఈ క్రమంలో పలు పార్టీలు పొత్తులపై చర్చలు జరుపుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్ష అన్నాడీఎంకే (AIADMK) పార్టీతో కలిసి బీజేపీ పోటీ చేయనుంది. ఈ మేరకు రెండు పార్టీల మధ్య సీట్ల పంపకంపై ఒప్పందం కుదిరింది. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామి ఈ విషయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో ఎన్‌డీఏ కూటమి పూర్తి బలంతో ఎన్నికల బరిలోకి దిగుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ ఒప్పందంలో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే.. బీజేపీకి సీట్లు పెరగడమే. ఈ సారి బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేయనుంది.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, పీఎంకే అగ్రనేత అన్బుమణి రామదాస్, ఏఎంఎంకే అధినేత టీటీబీ దినకరన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఢిల్లీ నుండి చెన్నై వరకు, బీజేపీ ఈసారి తన వ్యూహాన్ని మార్చుకుంది. ఉత్తర తమిళనాడులో బలమైన పట్టు కలిగిన పీఎంకే పార్టీకి 18 స్థానాలు కేటాయించారు. వన్నియర్ సామాజిక వర్గ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు పీఎంకే మద్దతు ఈ కూటమికి కీలకంగా భావిస్తున్నారు. ఈ సారి ఏఎంఎంకే పార్టీకి 11 సీట్లు కేటాయించారు. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలున్నాయి. డీఎంకే పార్టీని గద్దె దించడమే కూటమి లక్ష్యమని పళనిస్వామి పేర్కొన్నారు. అన్నాడీఎంకే, ఏఎంఎంకే కలిస్తే డీఎంకే విజయం సాధించడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. డీఎంకే-కాంగ్రెస్ మధ్య సైతం సీట్ల సర్దుబాటు కుదిరింది. కాంగ్రెస్‌కు 28 సీట్లతో పాటు రాజ్యసభ సీటు ఇచ్చేందుకు డీఎంకే అంగీకరించింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 25 స్థానాల్లో పోటీ చేయగా.. ఈ సారి అదనంగా మరో మూడు సీట్లు పెరిగాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vijay TVK cabinet 2026 | సీఎం విజయ్ ‘క్యాబినెట్ ఆఫ్ ఫస్ట్స్’: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం.. దళపతి మాస్టర్ మైండ్
మే 21, 2026

SIR | అర్హులకు ఓటు హక్కు కల్పించడమే సర్ లక్ష్యం : కలెక్టర్ గరిమ అగ్రవాల్
మే 20, 2026

Murder Case | వరంగల్‌లో జంట హత్యల కేసు: నిందితుడికి మరణశిక్ష విధించిన కోర్టు..!
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



