త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TVK Vijay | అధికారంలోకి వ‌స్తే రుణ‌మాఫీ.. రైతుల‌పై వ‌రాలు కురిపించిన టీవీకే విజ‌య్‌..!

TVK Vijay | త‌మిళ‌నాడులోని ప్ర‌ధాన పార్టీలైన డీఎంకే, ఏఐఎండీఎంకే ర‌హ‌స్య ఒప్పందం ఉంద‌ని, అందుకే ఒక్కో పార్టీ ఒక్కోసారి అధికారంలోకి వ‌స్తుంద‌ని టీవీకే చీఫ్‌, సినీ న‌టుడు విజ‌య్ ఆరోపించారు. త్వ‌ర‌లో జ‌రుగ‌నున్న ఎన్నిక‌ల్లో తాను అధికారంలోకి రాకుండా పార్టీలు కుట్ర ప‌న్నుతున్నాయ‌ని పేర్కొన్నారు.

P

National | Published On Mar 4, 2026, 7.30 pm IST

TVK Vijay | అధికారంలోకి వ‌స్తే రుణ‌మాఫీ.. రైతుల‌పై వ‌రాలు కురిపించిన టీవీకే విజ‌య్‌..!
Advertisement

TVK Vijay | త‌మిళ‌నాడులోని ప్ర‌ధాన పార్టీలైన డీఎంకే, ఏఐఎండీఎంకే ర‌హ‌స్య ఒప్పందం ఉంద‌ని, అందుకే ఒక్కో పార్టీ ఒక్కోసారి అధికారంలోకి వ‌స్తుంద‌ని టీవీకే చీఫ్‌, సినీ న‌టుడు విజ‌య్ ఆరోపించారు. త్వ‌ర‌లో జ‌రుగ‌నున్న ఎన్నిక‌ల్లో తాను అధికారంలోకి రాకుండా పార్టీలు కుట్ర ప‌న్నుతున్నాయ‌ని పేర్కొన్నారు. తంజావూరు సమీపంలోని సెంగిపట్టిలో బుధ‌వారం జ‌రిగిన పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో విజ‌య్ పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ “రాజకీయాలు ‘కలెక్షన్’ కోసం కావు. ప్రజల కోసం పనిచేయాలి. మేం ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాం. మా ప్రత్యర్థులకు ఇది బాగా తెలుసు. అందుకే మా చుట్టూ ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి. అందులో ప్రధానంగా డీఎంకే, ఏఐఏడీఎంకేలు కలిసి ఇంకెవరూ అధికారంలోకి రాకుండా చేసేందుకు ఒప్పందం చేసుకున్నాయి” అంటూ ఆరోపించారు.

బుర‌ద చ‌ల్లే ప్ర‌య‌త్నాలు..

పార్టీల పేర్లు ప్రస్తావించకుండా, బయటకు ఒకరిపై ఒకరు శ‌త్రువుల్లా చెప్పుకుంటూ.. లోపల మాత్రం ప్రజలను మోసం చేస్తూ అధికారంలో ఉండేందుకు పరస్పర అవగాహనతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. “నా రాజకీయ ప్రవేశంతో వారి ప్రణాళిక దెబ్బతింటుందని వారికి అర్థమైంది. అందుకే ఒక పార్టీ నా సమావేశాలపై అనుమతులపై కఠిన నిబంధనలు విధిస్తూ అడ్డంకులు సృష్టిస్తోంది. మరో పార్టీ నాపై బుర‌ద చల్లే ప్రయత్నం చేస్తోంది” అని ఆరోపించారు. కరూర్ తొక్కిసలాట ఘటన నుంచి ‘జననాయకన్’ సినిమా విడుదల వరకు తనపై ఆరోపణలు చేస్తున్నారని విజయ్ విమ‌ర్శించారు. జననాయకన్ విడుదల విషయంలో కనీసం కొందరు మద్దతు తెలిపార‌ని, సీఎం ఎంకే స్టాలిన్ కూడా ప్రత్యక్షంగా కాకపోయినా స్పందించార‌న్నారు. అందుకు ఆయ‌న‌కు కృతజ్ఞతలు” తెలుపుతున్నాన‌న్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కాద‌ని.. తనకూ, తమిళనాడు ప్రజలకూ అవి భావోద్వేగ‌మ‌ని విజ‌య్ పేర్కొన్నారు. తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సాధించలేని లక్ష్యాన్ని తాను సాధిస్తానన్న స్టాలిన్ వ్యాఖ్యల్లో నిజం లేద‌న్నారు. రాష్ట్రంలోని రైతుల పక్షాన నిలబడటంలో డీఎంకే విఫలమైందని, ఇసుక మాఫియాకు అండ‌గా నిలుస్తోంద‌ని ఆరోపించారు. కావేరి, ముల్లపెరియార్ త‌దిత‌ర అంశాలపై తాను మౌనం వహిస్తున్నానన్న విమర్శలను ఖండించారు. స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహ‌న‌తో పాటు ప‌రిష్కారం కోసం అధ్య‌య‌నం చేస్తున్నాన‌న్నారు. టీవీకే అధికారంలోకి వ‌చ్చాక రైతుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేసినా..

టీవీకే అధికారంలోకి వస్తే రైతుల అభీష్టానికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేసినా ఎలాంటి ప్రాజెక్టును అమలు చేయబోమని హామీ ఇచ్చారు. తన విజన్ కేవలం ఎన్నికల హామీలు కాదని పేర్కొంటూ విజయ్ పలు హామీలు ఇచ్చారు. ఐదు ఎకరాల వరకు వ్య‌వ‌సాయ భూమి క‌లిగిన రైతుల‌కు సహకార పంట రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని ప్ర‌క‌టించారు. దు ఎకరాలకుపైగా భూమి ఉన్న రైతులకు 50 శాతం వరకు రుణమాఫీ చేస్తామ‌ని, రెండు ఎకరాల వరకు భూమి కలిగిన రైతులు, భూమిలేని వ్యవసాయ కార్మికుల పిల్లల చ‌దువుల‌కు సంబంధించిన ఖ‌ర్చుల‌ను ప్రభుత్వం భరిస్తుందని భ‌రోసా ఇచ్చారు. మత్స్యకారుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తామ‌న్నారు.

Advertisement
Advertisement