త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AAP Mps merge with BJP | బీజేపీలో ..ఆమ్ ఆద్మీ పార్టీ విలీనం? రాజ్యసభలో సంచలనం

మూలిగే నక్కపైన తాటిపండు పడ్డట్టు.. పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి మరో షాక్ తగిలింది. భారతీయ జనతా పార్టీ (BJP) పన్నిన రాజకీయ వ్యూహానికి ఎదురుదెబ్బ కొట్టలేక విలవిలలాడుతున్నది.

P

National | Published On Apr 24, 2026, 4.11 pm IST

AAP Mps merge with BJP | బీజేపీలో ..ఆమ్ ఆద్మీ పార్టీ విలీనం? రాజ్యసభలో సంచలనం

సంక్షిప్త సారాంశం

Raghav Chadda | ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) కి కోలుకోలని దెబ్బ ఎదురైంది. అనూహ్య రాజకీయ పరిణామాల్లో భాగంగా రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ.. ప్రస్తుతం బీజేపీలో విలీనమయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. ఆప్ కు చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు రాఘవ్‌ చద్దా ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరనున్నట్లు వెల్లడించారు. తనతో పాటు మరో ఇద్దరు ఎంపీలు శోక్‌ మిట్టల్‌, సందీప్‌ పాఠక్‌ సైతం బీజేపీలో చేరనున్నారని చద్దా వెల్లడించారు. కాగా, రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసేందుకు అవసరమైన మరో నలుగురు ఎంపీలు హర్భజన్ సింగ్, రాజీందర్ గుప్తా, విక్రమ్ సహ్నీ, స్వాతి మలివాల్ కూడా విలీనానికి ఒప్పుకున్నారని .. మిగతాది లాంఛనమేనని వెల్లడించారు.

Advertisement

Raghav Chadda | ఆమ్‌ ఆద్మీ పార్టీ (Aam Aadmi party)కి షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు (MP) రాఘవ్‌ చద్దా  (Raghav Chadha)ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఆయన భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరనున్నట్లు వెల్లడించారు. రాఘవ్‌తో పాటు అశోక్‌ మిట్టల్‌, సందీప్‌ పాఠక్‌ సైతం బీజేపీలో చేరనున్నారు. సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్‌లతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో రాఘవ్‌ చద్దా మాట్లాడుతూ  భారత రాజ్యాంగంలోని నిబంధనలను ఉపయోగించి రాజ్యసభలో (Rajya sabha) ని ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల్లో మూడింట రెండొంతు మంది బీజేపీలో విలీనం కావాలని నిర్ణయించుకున్నామన్నారు.

 Harbhajan Singh, Rajinder Gupta, Vikram Sahney and Swati Maliwal కూడా

స్వాతి మాలివాల్, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్  (Harbhajan singh), విక్రమ్ సహ్ని, రాజీందర్ గుప్తాలు  కూడా బీజేపీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. తప్పుడు పార్టీలో సరైన వ్యక్తినన్న రాఘవ్‌.. తాను తన రక్తం, చెమటతో పార్టీని నడిపించామన్నారు. పార్టీ కోసం 15 సంవత్సరాలు పని చేశానన్నారు. ప్రస్తుతం పార్టీ తన ప్రాథమిక సూత్రాలు, విలువలు, నైతికత నుంచి పూర్తిగా దూరమైందని ఆరోపించారు. దేశ ప్రయోజనాల కోసం కాకుండా వ్యక్తిగత లాభాల కోసం పని చేస్తోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో తాను తప్పు పార్టీలో ఉన్న సరైన వ్యక్తినని గ్రహించానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సందీప్ పాఠక్ మాట్లాడుతూ ‘నా జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. చదువు పూర్తి చేసి దేశానికి పెద్దగా ఏదో చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చాను. దేశ సేవ కోసమే ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాను’ అని తెలిపారు.

ఆప్‌తో ఎక్కడ చెడింది..?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Aravind kejriwal) జైలులో ఉన్న సమయంలో రాఘవ్ చద్దా లండన్‌లో తన భార్య పరిణీతి (Parineeti chopra) చోప్రాతో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. అప్పటి నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీకి, రాఘవ్‌కు మధ్య దూరం పెరుగుతూ వచ్చినట్లుగా తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ ఆయనను పంజాబ్‌ రాజకీయాలకు దూరంగా ఉంచినట్లు సమాచారం. శ్రీ ఆనంద్‌పూర్‌ సాహిబ్‌ ( Sri Ananad pur sahib) నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఇటీవలి కాలంలో పార్టీకి సంబంధించిన ముఖ్య అంశాలపై రాఘవ్ చద్దా స్పందించడం లేదు. ఆయన రాజ్యసభలోనూ ప్రజలకు సంబంధించిన అంశాలను మాత్రమే ప్రస్తావించారు. ఆమ్ ఆద్మీ పార్టీలో అంతర్గత విభేదాల సంకేతంగా ప్రతిపక్షాలు అభివర్ణించాయి.

రాఘవ్ రాజకీయ ప్రస్థానం

చార్టర్డ్ అకౌంటెంట్ అయిన రాఘవ్ చద్దా 2012లో అన్నా హజారే ఉద్యమ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆ తర్వాత అర్వింద్ కేజ్రీవాల్‌కు సన్నిహితుగా గుర్తింపు పొందారు. ఢిల్లీలో పార్టీ ఆర్థిక, మీడియా వ్యూహాల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత పంజాబ్ రాజకీయాల్లోనూ చురుగ్గా వ్యవహరించారు. 2022లో పంజాబ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. పార్లమెంట్‌లో తన ప్రసంగాలతో గుర్తింపు పొందిన ఆయన, ఇటీవల పార్టీ నాయకత్వంతో విభేదాల నేపథ్యంలో బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement
Advertisement