BHEL | ఐటీఐ అర్హతతో బీహెచ్ఈఎల్‌లో 660 ఆర్టిసన్ ఉద్యోగాలు
BHEL | భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) దేశవ్యాప్తంగా ఉన్న తన 9 తయారీ యూనిట్లలో 660 Artisan Grade IV ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫౌండ్రీమ్యాన్ ట్రేడ్‌లలో మొత్తం 660 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
BHEL | త్రినేత్ర న్యూస్: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) దేశవ్యాప్తంగా ఉన్న తన 9 తయారీ యూనిట్లలో 660 Artisan Grade IV ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫౌండ్రీమ్యాన్ ట్రేడ్‌లలో మొత్తం 660 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఐటీఐ (ITI) పూర్తి చేసి నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు ఈ నెల 21 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులు నవంబర్ 18న ముగుస్తాయి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ కాలంలో నెలకు రూ.24,000 స్టెయిపండ్ చెల్లింస్తారు. విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న తర్వాత ఆర్టిసన్ గ్రేడ్-IV గా నియమిస్తారు. అప్పుడు జీతం రూ. 29,500 నుంచి రూ.65,000 వరకు ఉంటుంది. హైదరాబాద్ పటాన్‌చెరులోని బీహెచ్ఈఎల్ యూనిట్ (హెవీ పవర్ ఎక్విప్‌మెంట్ ప్లాంట్ (HPEP))లో 60 ఖాళీలు, ఏపీలో విశాఖలో ఉన్న హెవీ ప్లేట్స్ అండ్ వెస్సెల్స్ ప్లాంట్ (HPVP)లో 120 పోస్టులు ఉన్నాయి.
పోత్తం ఖాళీలు: 660
ఫిట్టర్ (Fitter)- 278
వెల్డర్ (Welder)- 104
మెషినిస్ట్ (Machinist)- 101
ఎలక్ట్రీషియన్ (Electrician)- 90
టర్నర్ (Turner)- 52
ఎలక్ట్రానిక్స్ మెకానిక్ (Electronics Mechanic)- 23
ఫౌండ్రీమ్యాన్ (Foundryman)- 12
తెలంగాణలో- 60 (ఫిట్టర్10, మెషినిస్ట్23, ఎలక్ట్రీషియన్ 5, టర్నర్ 22)
ఏపీలో- 120 (ఫిట్టర్ 60, వెల్డర్ 25, మెషినిస్ట్ 14, ఎలక్ట్రీషియన్ 6, టర్నర్ 6, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 3, ఫౌండ్రీమ్యాన్ 6)
అర్హతలు: పదో తరగతి (10th) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ (ITI / NTC), నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ (NAC) ఉండాలి. జనరల్ ఓబీసీ అభ్యర్థులకు కనీసం 60 శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు ఉండాలి. 2026, అక్టోబర్ 1 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT): మొత్తం 120 మార్కులకు ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది (70 మార్కులు సంబంధిత ట్రేడ్ సబ్జెక్ట్, 30 మార్కులు ఇంజినీరింగ్ కాలిక్యులేషన్స్, 20 మార్కులు రీజనింగ్). ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి స్కిల్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.1,072 (ఎగ్జామ్ ఫీజు రూ.600, ప్రాసెసింగ్ ఫీజు రూ.400+జీఎస్టీ), ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు రూ.472
దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 21
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 18 (రాత్రి 11.45 గంటల వరకు)
రాత పరీక్ష: డిసెంబర్ 11 (తాత్కాలికం)
వెబ్‌సైట్: www.careers.bhel.in
సంబంధిత వార్తలు

Nalgonda Medical College | నల్లగొండ మెడికల్ కాలేజీలో పారామెడికల్ డిప్లొమా కోర్సులు.. ఈ నెల 24 వరకు దరఖాస్తులు
అక్టోబర్ 18, 2026

CWC Recruitment | సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
అక్టోబర్ 17, 2026

UCO Bank | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు
అక్టోబర్ 16, 2026
తాజావార్తలు
- ●Ananda Nilayam | తిరుమల బంగారు గోపురం.. తొలిసారి స్వర్ణ తాపడం చేయించింది ఎవరు?
- ●Conjoined Twins | ఒకే శరీరం.. రెండు తలలతో జన్మించిన బాలుడు.. శ్వాసకోశ సమస్యతో వారం రోజులు పోరాడి..
- ●Horoscope | అక్టోబర్ 19 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ప్రయాణాలలో జాగ్రత్త అవసరం!
- ●Ranveer Singh Vs Deepika Padukone | పార్టీ మధ్యలో రణ్వీర్ ప్యాంట్ చిరిగితే.. దీపిక ఏం చేసిందో తెలుసా?
- ●Tilak Varma | నంబర్ 3 నుంచి 6 వరకు రెడీ.. టీమిండియా కోసం ఏ పాత్రైనా పోషిస్తా!
- ●White Dwarf | అరుదైన ఆవిష్కరణ.. ఆకుపచ్చ రంగులో మెరిసే నక్షత్రం!

Ananda Nilayam | తిరుమల బంగారు గోపురం.. తొలిసారి స్వర్ణ తాపడం చేయించింది ఎవరు?

Conjoined Twins | ఒకే శరీరం.. రెండు తలలతో జన్మించిన బాలుడు.. శ్వాసకోశ సమస్యతో వారం రోజులు పోరాడి..

Horoscope | అక్టోబర్ 19 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ప్రయాణాలలో జాగ్రత్త అవసరం!

Ranveer Singh Vs Deepika Padukone | పార్టీ మధ్యలో రణ్వీర్ ప్యాంట్ చిరిగితే.. దీపిక ఏం చేసిందో తెలుసా?



