Syed Abdul Rehman Naqvi | ఢిల్లీని కదిలిస్తాం.. అఖండ భారతాన్ని ముక్కలు చేస్తాం : లష్కరే ఉగ్రనేత
Syed Abdul Rehman Naqvi | పాక్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తాయిబా (Lashkar e Taiba commander) ఉగ్రసంస్థ.. భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది.
Syed Abdul Rehman Naqvi | పాక్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తాయిబా (Lashkar e Taiba commander) ఉగ్రసంస్థ.. భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. దేశంలోని పలు ప్రధాన నగరాలపై దాడులు చేపడతామని లష్కరే సీనియర్ కమాండర్ సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్ నఖ్వి (Syed Abdul Rehman Naqvi) బహిరంగ హెచ్చరికలు చేశారు. లాహోర్‌లో జరిగిన కార్యక్రమంలో అతడు ఈ వ్యాఖ్యలు చేశారు.
పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్న ఈ సభలో ఉగ్రనేత మాట్లాడుతూ.. అఖండ భారతాన్ని ముక్కలు చేస్తామంటూ హెచ్చరించారు. " అఖండ భారతాన్ని ముఖ్కలు చేస్తాం. ఆగ్రాకు నిప్పుపెడతాం. దక్కన్‌ను మండిస్తాం. ఢిల్లీ పునాదుల్ని కదిలిస్తాం" అంటూ హెచ్చరించారు. రాజకీయ నాయకులు హాజరైన వేదికపై ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. లష్కరే తోయిబాకు రాజకీయ ముఖంగా పరిగణించబడే పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్‌తో నఖ్వికి సంబంధం ఉంది. LeT వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్‌కు ఆయన సన్నిహితుడిగా భావిస్తారు. అతను పాకిస్థాన్ మర్కాజీ ముస్లిం లీగ్‌కు కూడా నాయకత్వం వహిస్తున్నాడు.
కాగా, గతేడాది పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాక్ భూభాగంలోని ఉగ్రసంస్థలపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ చేపట్టి తొమ్మిది ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. భారత్ దాడిలో ఉగ్రవాద సంస్థలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అయినా వారి బుద్ధి మారడం లేదు. ఏదో ఒకచోట భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.
సంబంధిత వార్తలు

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

Barakah nuclear facility | ప్రమాదకర పరిణామం.. యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై దాడిని ఖండించిన భారత్
మే 18, 2026

Operation Sindoor | ఆపరేషన్ సిందూర్‌లో భారత్‌దే విజయం.. ఆస్ట్రియన్ సైనిక నిపుణుడి సంచలన వ్యాఖ్యలు..!
మే 6, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



