త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Karnataka CM | డీకేని సీఎంని చేయాలి.. హైక‌మాండ్‌కు 90 మంది ఎమ్మెల్యేల అభ్య‌ర్థ‌న‌

Karnataka CM | కాంగ్రెస్ పాలిత‌ కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పుపై మ‌రోసారి చ‌ర్చ మొద‌లైంది.

D

National | Published On Feb 10, 2026, 12.54 pm IST

Karnataka CM | డీకేని సీఎంని చేయాలి.. హైక‌మాండ్‌కు 90 మంది ఎమ్మెల్యేల అభ్య‌ర్థ‌న‌
Advertisement

Karnataka CM | కాంగ్రెస్ పాలిత‌ కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పుపై మ‌రోసారి చ‌ర్చ మొద‌లైంది. ముఖ్యమంత్రి (Karnataka CM) పీఠంపై డీకే శివకుమార్‌ (DK Shivakumar), సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) ఇద్దరూ చెరో రెండున్నరేళ్లు ఉంటారంటూ గ‌త కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే, అలాంటి ప్ర‌తిపాద‌న ఏదీ లేద‌ని పార్టీ నేత‌లు క్లారిటీ ఇచ్చిన‌ప్ప‌టికీ ప్ర‌చారం మాత్రం ఆగ‌డం లేదు. ఈ క్ర‌మంలో క‌ర్ణాట‌క సీఎం ప‌ద‌విపై మ‌రోసారి వార్త‌లు షికారు చేస్తున్నాయి. సిద్ధూని త‌ప్పించి ఆ స్థానంలో డీకేకి అవ‌కాశం ఇవ్వాలంటూ మెజారిటీ ఎమ్మెల్యేలు హైక‌మాండ్‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్న‌ట్లు తెలిసింది. ఈ విష‌యాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ (Iqbal Hussain) తాజాగా వెల్ల‌డించారు.

డీకే శివకుమార్‌కు సీఎం ప‌ద‌వి ఇవ్వాల‌ని దాదాపు 80 నుంచి 90 మందికి ఎమ్మెల్యేలు హైకమాండ్‌కు ప్ర‌తిపాదించిన‌ట్లు ఎమ్మెల్యే హుస్సేన్‌ తెలిపారు. అయితే, ఈ నిర్ణ‌యం పూర్తిగా పార్టీ అధిష్ఠానం చేతుల్లోనే ఉంద‌న్నారు. డీకేకి సీఎం ప‌ద‌వి ఇవ్వాల‌ని మెజారిటీ ఎమ్మెల్యేలు కోరుకుంటున్న‌ట్లు చెప్పారు. కొంద‌రు నాయ‌కులు (సీఎం సిద్ధూ కుమారుడు య‌తీంద్ర సిద్ధ‌రామ‌య్య‌ను ఉద్దేశించి) గంద‌ర‌గోళం సృష్టించే ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. త‌న తండ్రికి అనుకూలంగా మాట్లాడ‌టం ఆపాల‌ని సూచించారు.

ఇక్బాల్ హుస్సేన్‌కు ఉప ముఖ్య‌మంత్రి డీకేకి స‌న్నిహితుడిగా పేరుంది. గ‌తంలోనూ ఆయ‌న ఇలాంటి వ్యాఖ్య‌లే చేశారు. మెజారిటీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి మార్పు కోరుకుంటున్నార‌ని చెప్పారు. 100 మందికిపైగా ఎమ్మెల్యేలు డీకే శివకుమార్‌కు మద్దతు ఇస్తున్నట్లు గ‌తంలో వెల్ల‌డించారు. ఇప్పుడు కూడా ఆయ‌న అలాంటి వ్యాఖ్య‌లే చేయ‌డం గ‌మ‌నార్హం. ఎమ్మెల్యే వ్యాఖ్య‌ల‌తో క‌ర్ణాట‌క సీఎం మార్పుపై మ‌రోసారి చ‌ర్చ ఊపందుకుంది.

Advertisement
Advertisement