త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mallikarjun Kharge | క‌ర్నాట‌క సీఎం మార్పుపై మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..!

Mallikarjun Kharge | క‌ర్నాట‌క‌లో గ‌త కొద్దిరోజులుగా ముఖ్య‌మంత్రి మార్పు అంశం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గ‌త కొద్దిరోజులుగా ఊహాగానాలు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ అంశంపై ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే ప్ర‌చారానికి తెర‌దించారు. సిద్ధ‌రామ‌య్య ముఖ‌మంత్రి ప‌ద‌విలో కొన‌సాగుతార‌ని ఖ‌ర్గే స్ప‌ష్టం చేశారు.

P

National | Published On May 1, 2026, 4.22 pm IST

Mallikarjun Kharge | క‌ర్నాట‌క సీఎం మార్పుపై మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..!
Advertisement

Mallikarjun Kharge | క‌ర్నాట‌క‌లో గ‌త కొద్దిరోజులుగా ముఖ్య‌మంత్రి మార్పు అంశం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గ‌త కొద్దిరోజులుగా ఊహాగానాలు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ అంశంపై ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే ప్ర‌చారానికి తెర‌దించారు. సిద్ధ‌రామ‌య్య ముఖ‌మంత్రి ప‌ద‌విలో కొన‌సాగుతార‌ని ఖ‌ర్గే స్ప‌ష్టం చేశారు. అయితే, పార్టీ నిర్ణ‌యాల‌న్నీ సోనియాగాంధీ తీసుకుంటార‌ని వ్యాఖ్యానించారు. సీఎం మార్పుపై ప్రతిరోజూ చర్చలు జరుగుతూనే ఉంటాయని ఖర్గే తెలిపారు. ఈ అంశంపై తుది నిర్ణయం ఏఐసీసీ అధ్యక్షుడిగా తాను, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ క‌లిసి తీసుకుంటామని చెప్పారు. పార్టీకి సంబంధించిన కీలక రాజకీయ, సంస్థాగత నిర్ణయాల విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ సీనియర్ నేతలతో సంప్రదింపులు జరుపుతుందని వెల్లడించారు.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రమేయం లేకుండా ఎలాంటి నిర్ణయమూ తీసుకోబోమని ఖర్గే స్పష్టం చేశారు. ప్రస్తుతం సీఎం మార్పు విష‌యంలో తేదీలు ఏమీ నిర్ణ‌యించ‌లేద‌ని, ఊహాగానాలు సమంజసం కాదన్నారు. క‌ర్నాట‌క ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో పెట్టుకొని తుది నిర్ణ‌యం ఉంటుంద‌ని తెలిపారు. అంద‌రూ పార్టీ నాయ‌క‌త్వం తీసుకునే నిర్ణ‌యాన్ని గౌర‌వించాల‌ని కోరారు. దీనిపై ప్ర‌తిప‌క్ష బీజేపీ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించింది. కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు ఖ‌ర్గే చేసేది ఏంట‌ని ప్ర‌శ్నించింది.

క‌ర్నాట‌క కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు అంశంపై అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనుచరులు, ఉప ముఖ్యమంత్రి డీకే శివ‌కుమార్ వర్గాల మధ్య ఈ వివాదం స్పష్టంగా కనిపిస్తోంది. 2023లో జరిగిన అధికార భాగస్వామ్య ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ, మిగిలిన కాలానికి డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నాయకత్వ పోరాటం కారణంగా ప్రభుత్వం స్థిరత్వంపై చర్చలు జోరందుకున్నాయి. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పలుమార్లు చర్చలు జరిగినట్లు సమాచారం.

గత నవంబర్‌లోనే సిద్ధ‌రామ‌య్య స‌గం ప‌ద‌వీకాలం పూర్తి అయ్యింది. క‌ర్నాట‌క కాంగ్రెస్‌లో అంతర్గత రాజకీయ సమీకరణాల్లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌తో పాటు హోంమంత్రి జీ ప‌ర‌మేశ్వ‌ర కీల‌క నేత‌లుగా భావిస్తున్నారు. నాయకత్వ అనిశ్చితిని త్వరలోనే ప‌రిష్క‌రించాల‌ని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు ఖర్గే ఇటీవల పేర్కొన్నారు. సంస్థాగత పరిస్థితులను బట్టి సిద్ధరామయ్యను కొనసాగించాలా? లేక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలా అన్న దానిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement
Advertisement