Road Accident | మంత్రాలయ రాఘవేంద్రుని దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు
Road Accident | ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు (Kurnool) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. గురువారం తెల్లవారుజామున మంత్రాలయం (Mantralayam) మండలం చిలకలడోన వద్ద బొలెరో వాహనం-రెడీమిక్స్ లారీ ఢీకొన్నాయి.
Road Accident | త్రినేత్ర.న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు (Kurnool) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. గురువారం తెల్లవారుజామున మంత్రాలయం (Mantralayam) మండలం చిలకలడోన వద్ద బొలెరో వాహనం-రెడీమిక్స్ లారీ ఢీకొన్నాయి. దీంతో 8 మంది మృతిచెందగా, మరో 12 మంది గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, మూడేండ్ల చిన్నారి ఉన్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలుచేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఘటనాస్థలంలోనే ఐదుగురు మృతిచెందారని, ముగ్గురు దవాఖానలో చికిత్స పొందుతూ చనిపోయారని తెలిపారు.

వీరంతా కర్ణాటకలోని చిక్‌మంగళూరుకు చెందినవారిగా గుర్తించారు. మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్రస్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాదం ధాటికి బొలెరో వాహనం నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






