త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chemical Factory Fire | కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం

Chemical Factory Fire | రాజ‌స్థాన్ (Rajasthan)లో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. భివాడి (Bhiwadi)లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీ (Chemical Factory)లో భారీ పేలుడు (Chemical Factory Fire) సంభ‌వించింది.

D

National | Published On Feb 16, 2026, 3.54 pm IST

Chemical Factory Fire | కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం
Advertisement

Chemical Factory Fire | రాజ‌స్థాన్ (Rajasthan)లో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. భివాడి (Bhiwadi)లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీ (Chemical Factory)లో భారీ పేలుడు (Chemical Factory Fire) సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో ఏడుగురు కార్మికులు స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు. సోమ‌వారం ఉద‌యం 9 గంట‌ల ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. తొలుత ఫ్యాక్ట‌రీ నుంచి పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగాయి. ఆ త‌ర్వాత భారీ శ‌బ్దంతో పేలుళ్లు సంభ‌వించాయి. ప్ర‌మాద స‌మ‌యంలో ఫ్యాక్ట‌రీలో 20 నుంచి 25 మంది వ‌ర‌కూ కార్మికులు ప‌నిచేస్తున్నారు. అప్ర‌మ‌త్త‌మైన స్థానికులు వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అక్క‌డ స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా స్థానికుల‌ను అక్క‌డి నుంచి ఖాళీ చేయించారు. ఆ త‌ర్వాత మంట‌ల్లో చిక్కుకుపోయిన వారిని ర‌క్షించారు. స‌జీవ‌ద‌హ‌న‌మైన ఏడుగురు కార్మికుల మృత‌దేహాల‌ను బ‌య‌ట‌కు తీశారు. ఈ మేర‌కు ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ప్ర‌ధాని దిగ్భ్రాంతి..

ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు సంతాపం వ్య‌క్తం చేశారు. గాయ‌ప‌డిన‌వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు.

Advertisement
Advertisement