Uttar Pradesh | ఉత్తరప్రదేశ్‌లో తుఫాన్ బీభత్సం.. 89 మంది మృతి
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) తుఫాన్ బీభత్సం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పిడుగులు, బలమైన ఈదురుగాలులతో కూడిన బారీ వర్షం కురిసింది. దీంతో సుమారు 89 మంది మంది మరణించారు.
Uttar Pradesh | త్రినేత్ర.న్యూస్: ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) తుఫాన్ బీభత్సం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పిడుగులు, బలమైన ఈదురుగాలులతో (Powerful Storm0 కూడిన భారీ వర్షం (Heavy Rain) కురిసింది. దీంతో సుమారు 89 మంది మంది మరణించారు. బుధవారం ప్రయాగ్‌రాజ్, ప్రతాప్‌గఢ్, భదోహి, ఫతేపూర్, ఉన్నావో, కాన్పూర్ దేహత్, చందౌలీ, సోన్‌భద్ర జిల్లాల్లో దీని ప్రభావం అధికంగా ఉన్నది. ప్రకృతి ప్రకోపానికి ఒక్క ప్రయాగ్‌రాజ్ జిల్లాలోనే 16 మంది మృతిచెందారు. బదౌనీలో 16 మంది, ఫతెపూర్ జిల్లాలో 9 మంది, బదౌనీలో 5, ఎన్నావోలో 4, కాన్పూర్ దేహత్‌లో ముగ్గురు చొప్పున చనిపోయారు. అయితే గాయపడిన వారి సంఖ్యను ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతోపాటు మొబైల్ నెట్‌వర్క్‌లు పనిచేయడం లేదు.

వడగళ్ల వానతో పాటు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. దీంతో అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోయాయి. ఇండ్లు ధ్వంసమయ్యాయి. మృతుల్లో ఎక్కువ మంది పొలాల్లో పని చేస్తున్న వారు, వర్షం నుంచి తప్పించుకోవడానికి చెట్ల కింద ఆశ్రయం పొందిన వారే ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా, మొబైల్ నెట్‌వర్క్‌లకు అంతరాయం కలగడంతో పునరుద్ధరణ, సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నదని కున్వర్ అదనపు కలెక్టర్ వీరేంద్ర కుమార్ మౌర్య చెప్పారు. జిల్లాలోని స్థానిక అధికారులు, పోలీసులు సహాయకచర్యలు చేపడుతున్నారని వెల్లడించారు.

అకాల వర్షం, ఈదురుగాలు, పిడుగుబాట్లు బాధితులకు ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) అధికారులను ఆదేశించారు. 24 గంటల్లోగా సహాయక చర్యలను పూర్తిచేయాలని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో అన్ని జిల్లాల కలెక్టర్లు పర్యటించాలని, బాధితులకు అవసరమైన సహాయం అందించాలన్నారు. సహాయకచర్యల్లో నిర్లక్ష్యం వహించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ, ఇన్సూరెన్స్ కంపెనీలు జరిగిన నష్టాన్ని అంచనావేసి తమకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
⛈️ #BREAKING#UttarPradesh में बारिश और तूफान का कहर 🌩️
प्रदेश के कई जिलों में आंधी-तूफान और भारी बारिश से
करीब 31 लोगों की मौत की खबर।
पेड़ गिरने, दीवार ढहने और बिजली हादसों से भारी नुकसान।
प्रशासन अलर्ट पर।#UPWeather #Storm #RainAlert #BreakingNews pic.twitter.com/WKEGgFzBqd— News & Features Network | World & Local News (@newsnetmzn) May 13, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






