Encounter | గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి.. ప్రాణాలొదిలిన కానిస్టేబుల్
Encounter | ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ (Bijapur) అడవుల్లో జరిగిన కాల్పుల్లో కీలక నేత ఉదమ్ సింగ్ మృతిచెందిన ఘటన మరువకముందే మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌లో (Encounter) ముగ్గురు మావోయిస్టులు మరణించారు.
Encounter | త్రినేత్ర.న్యూస్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ (Bijapur) అడవుల్లో జరిగిన కాల్పుల్లో కీలక నేత ఉదమ్ సింగ్ మృతిచెందిన ఘటన మరువకముందే మావోయిస్టు (Maoists) పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌లో (Encounter) ముగ్గురు మావోయిస్టులు మరణించారు. భ్రమగఢ్ తాలూకాలో గురువారం సాయంత్రం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరుగుతున్న ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఇందులో ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభించాయి.
ఘటనా స్థలంలో ఒక ఏకే-47 రైఫిల్‌తో పాటు పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. మావోయిస్ట్‌ల కాల్పుల్లో పోలీసు కానిస్టేబుల్ దీపక్ మాధవి ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. సి-60 కమాండో జోగా దీపక్ గాయపడ్డారని, అతడిని హెలికాప్టర్‌లో గడ్చిరోలిలోని దవాఖానకు తరలించామన్నారు. ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉందని వెల్లడించారు.

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లా అటవీప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు కీలక నేత ఉదమ్ సింగ్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఘటనాస్థలం నుంచి ఆయన మృతదేహంతో పాటు, ఒక ఏకే-47 ఆటోమేటిక్ రైఫిల్ స్వాధీనం చేసుకున్నట్లు బీజాపుర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర యాదవ్ వెల్లడించారు.
కాగా, ఛత్తీసగ్ఢ్లో ఈ ఏడాది ఇప్పుటివరకు జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో కనీసం 23 మంది మావోయిస్టులు మరణించారు. జనవరి 3న సుక్మా, బీజాపుర్‌లో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో 14 మంది, బీజాపుర్‌లో జనవరి 17న ఆరుగురు, జనవరి 29న మరో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు.
సంబంధిత వార్తలు

Palghar Road Accident | మహారాష్ట్రలో నెత్తురోడిన హైవే.. నిశ్చితార్థానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. 11 మంది మృతి
మే 18, 2026

Seaweed Farming | చేపలు లేవని బాధ లేదు.. సముద్రంలోనే కొత్త వ్యవసాయం: మత్స్యకారుల తలరాత మారుస్తున్న ‘సీవీడ్’ సాగు!
మే 16, 2026

Onion Capital of India | భారతదేశపు ఉల్లిగడ్డల రాజధాని అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?
మే 2, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



