త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Reels | రీల్స్ చేస్తూ.. లారీ కిందికి దూసుకెళ్లారు.. ముగ్గురు సోద‌రులు దుర్మ‌ర‌ణం

Reels | వారు ముగ్గురు అన్న‌ద‌మ్ములు.. సోష‌ల్ మీడియాలో (social media) ఫేమ్ అవుదామ‌నుకున్నారు. ఇంకేముంది బైక్‌పై స్టంట్స్ చేస్తూ రీల్స్ (Reels) తీస్తున్నారు. బైక్‌పై అధిక వేగంతో దూసుకెళ్తూ అదుపుత‌ప్పి ఓ ట్ర‌క్‌ను ఢీకొట్టారు.

G

National | Published On Apr 20, 2026, 6.22 am IST

Reels | రీల్స్ చేస్తూ.. లారీ కిందికి దూసుకెళ్లారు.. ముగ్గురు సోద‌రులు దుర్మ‌ర‌ణం
Advertisement

Reels | త్రినేత్ర‌.న్యూస్‌: వారు ముగ్గురు అన్న‌ద‌మ్ములు.. సోష‌ల్ మీడియాలో (social media) ఫేమ్ అవుదామ‌నుకున్నారు. ఇంకేముంది బైక్‌పై స్టంట్స్ చేస్తూ రీల్స్ (Reels) తీస్తున్నారు. బైక్‌పై అధిక వేగంతో దూసుకెళ్తూ అదుపుత‌ప్పి ఓ ట్ర‌క్‌ను ఢీకొట్టారు. ముగ్గ‌రూ అక్క‌డిక‌క్క‌డే దారుణంగా మృతిచెందారు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని (Madhya Pradesh) మౌగంజ్ జిల్లాలో ఈ నెల 14న జ‌రిగింది. ప్ర‌స్తుతం ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది.

మౌగంజ్ జిల్లా బేలా గ్రామంలో ఉప‌లాక్ష్ కోల్ (17), అమ్రిశ్ కోల్ (22), హేమ్‌రాజ్ కోల్ (17) ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్న‌ద‌మ్ములు (three brothers).. మ‌రో ఇద్ద‌రు సోద‌రులు ప్ర‌దీప్ ద్వివేదీ, ప్ర‌శాంత్ ద్వివేదీతో క‌లిసి రీల్స్ తీస్తున్నారు. ముగ్గురు సోద‌రులు ప‌ల్స‌ర్ బైక్‌, మిగిలిన‌ ఇద్ద‌రు మ‌రో ద్విచ‌క్ర వాహ‌నంపై జాతీయ ర‌హ‌దారి మీదుగా దూసుకెళ్తున్నారు. కోల్ సోద‌రులు చేతిలో దేశీ తుపాకీ ప‌ట్టుకుని ప‌ల్స‌ర్‌పై వెళ్తుండ‌గా.. ద్వివేదీ బ్ర‌ద‌ర్స్ త‌మ ఫోన్‌లో బందిస్తున్నారు. స్టంట్స్ చేస్తూ.. లారీ మ‌ధ్య నుంచి దూసుకెళ్తున్నారు. ఈ క్ర‌మంలో ఓ ట్ర‌క్‌ను ఎడ‌మ వైపు నుంచి ఓవ‌ర్ టేక్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. అయితే రోడ్డు ప‌క్క‌నే ఓ లారీ ఆగి ఉంది.

అస‌లే ఓవ‌ర్ స్పీడ్‌.. బైకును ఆప‌డం కుద‌ర‌లేదు. ఇంకేముంది.. లారీ వెనుక నుంచి బ‌లంగా ఢీకొట్టారు. దీంతో బండి నుజ్జునుజ్జు అవ‌గా.. ముగ్గురు సోద‌రులు రోడ్డుపై చెల్లాచెదురుగా ప‌డిపోయారు. ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. వీడియో తీస్తున్న బైక్ కూడా అదే లారీ ఢీకొట్టింది. దీంతో దానిపై ఉన్న ద్వివేదీ సోద‌రులు కూడా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. రీల్స్ పిచ్చితో ప్రాణాలు తీసుకుని.. కుటుంబాల్లో విషాదం మిగిల్చారు.

Advertisement
Advertisement