త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vande Bharat | వందే భార‌త్ Vs చైనా బుల్లెట్ రైలు.. నెట్టింట విప‌రీతంగా చ‌ర్చ‌

Vande Bharat | న‌లిని ఉగాన‌ర్ అనే మ‌హిళ త‌న సోద‌రుడి ప్ర‌యాణ అనుభ‌వాన్ని ఎక్స్‌లో పోస్టు చేసింది. చైనాలో కేవలం ఒక గంటలో గమ్యాన్ని చేరుకోవడానికి రూ.1,600 ఖర్చవుతుంటే.. అదే దూరానికి మ‌న దేశంలో దాదాపు మూడు గంటల సమయం పడుతోందని ఆమె పేర్కొన్నారు.

D

National | Published On Feb 28, 2026, 11.26 am IST

Vande Bharat | వందే భార‌త్ Vs చైనా బుల్లెట్ రైలు.. నెట్టింట విప‌రీతంగా చ‌ర్చ‌
Advertisement

Vande Bharat | చైనా, భార‌త్‌లో రైలు ప్ర‌యాణాల‌ను పోలుస్తూ ఓ మ‌హిళ చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారితీస్తోంది. త‌న సోద‌రుడు చైనా హై స్పీడ్ రైలు (Chinas Bullet Train)లో, భార‌త్‌లోని వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat) రైలులో ప్ర‌యాణించిన ఫొటోల‌ను ఆమె ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌యాణ అనుభ‌వాన్ని ఆమె వివ‌రించారు. ఆమె పెట్టిన ఈ పోస్టు జ‌ర్నీ టైమ్‌, స్పీడ్‌, కాస్ట్ గురించే కాకుండా రెండు దేశాల మ‌ధ్య మౌలిక స‌దుపాయాలు, అభివృద్ధిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు (online debate) దారితీసింది.

న‌లిని ఉగాన‌ర్ అనే మ‌హిళ త‌న సోద‌రుడి ప్ర‌యాణ అనుభ‌వాన్ని ఎక్స్‌లో పోస్టు చేసింది. చైనాలో కేవలం ఒక గంటలో గమ్యాన్ని చేరుకోవడానికి రూ.1,600 ఖర్చవుతుంటే.. అదే దూరానికి మ‌న దేశంలో దాదాపు మూడు గంటల సమయం పడుతోందని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు ప్ర‌యాణ ఖ‌ర్చు.. రూ.1,050గా ఉంద‌ని పేర్కొంది. ఈ పోస్టుకు త‌న సోద‌రుడు చైనా హై స్పీడ్‌రైలు, వందేభార‌త్ రైలులో ప్ర‌యాణిస్తున్న రెండు ఫొటోల‌ను కూడా జ‌త‌చేసింది.

చైనాలో హై స్పీడ్ రైలు గంట‌కు 300 కిలోమీట‌ర్ల వేగంతో దూసుకెళ్తుంద‌ని పేర్కొంది. త‌న సోద‌రుడు 270 కిలోమీట‌ర్ల దూరాన్ని కేవ‌లం గంట వ్య‌వ‌ధిలోనే చేరుకున్నాడ‌ని తెలిపింది. అంతేకాదు, ఇందుకు టికెట్ ఖ‌ర్చు రూ.1,600 అని పేర్కొంది. అదే మ‌న దేశంలో వందేభార‌త్ రైలు గంట‌కు 95 కిలోమీట‌ర్ల వేగంతో వెళ్తుంద‌ని.. ఈ లెక్క‌న 260 కి.మీట‌ర్ల దూరానికి దాదాపు మూడు గంట‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని పేర్కొంది. ఇక టికెట్ ధ‌ర సుమారు రూ.1,050 (త‌త్కాల్‌) ఉంద‌ని పేర్కొంది. ఈ పోస్టు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. దీనిపై నెటిజ‌న్లు విప‌రీతంగా చ‌ర్చించుకుంటున్నారు.

నెటిజ‌న్ల భిన్నాభిప్రాయాలు

ఈ పోస్టుపై నెటిజ‌న్లు భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. చైనా సాంకేతికత, మౌలిక సదుపాయాలు భారత్ కంటే ఎంతో మెరుగ్గా ఉన్నాయ‌ని అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రికొంద‌రైతే మ‌న రైల్వే వ్యవస్థలో జరుగుతున్న మార్పులను, వందే భారత్ వంటి ఆధునిక రైళ్ల ప్రాముఖ్యతను సమర్థిస్తున్నారు. వందే భార‌త్ వంటి రైళ్ల‌తో భార‌త్ ఇప్పుడిప్పుడే ఆధునిక రైల్వే రంగంలోకి అడుగుపెడుతోంద‌ని.. భ‌విష్య‌త్తులో చైనా సాంకేతిక‌త‌, మౌలిక స‌దుపాయాల‌ను చేరుకుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. భవిష్య‌త్తులో బుల్లెట్ రైళ్ల రాక‌తో ఈ వ్య‌త్యాసం త‌గ్గుతుంద‌ని వాదిస్తున్నారు. ఇక చైనాతో పోలిస్తే భార‌త్‌లో ప్ర‌యాణం చౌక‌గా ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌యాణ స‌మ‌యం విష‌యంలో మెరుగుప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మ‌రికొంద‌రు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

https://x.com/NalinisKitchen/status/2027232958252495132

Advertisement
Advertisement