Howrah Station | 173 ఏండ్లనాటి రైల్వే స్టేషన్.. రోజూ 600కుపైగా రైళ్లు.. 10 లక్షల మంది ప్రయాణికులు
Howrah Station | త్రినేత్ర.న్యూస్: అది దేశంలో అతి పురాతన రైల్వే స్టేషన్ (Howrah Station). అత్యధిక ప్లాట్‌ఫారమ్‌లు. రోజూ 600 రైళ్లు, 10 లక్షల మందికిపైగా ప్రయాణికులు ఆ స్టేషన్ మీదుగా ప్రయాణిస్తుంటారు. 173 ఏండ్ల చరిత్ర కలిగిన ఈ స్టేషన్‌ను ఇప్పుడు రైల్వే శాఖ మరింత ఆధునీకరించనుంది.
Howrah Station | త్రినేత్ర.న్యూస్: అది దేశంలో అతి పురాతన రైల్వే స్టేషన్ (Howrah Station). అత్యధిక ప్లాట్‌ఫారమ్‌లు. రోజూ 600 రైళ్లు, 10 లక్షల మందికిపైగా ప్రయాణికులు ఆ స్టేషన్ మీదుగా ప్రయాణిస్తుంటారు. 173 ఏండ్ల చరిత్ర కలిగిన ఈ స్టేషన్‌ను ఇప్పుడు రైల్వే శాఖ మరింత ఆధునీకరించనుంది. మరిన్ని ప్లాట్‌ఫారమ్‌ను ఏర్పాటు చేయడంతోపాటు ఇంకొన్ని రైళ్లను ఆ స్టేషన్ మీదుగా నడిపేందుకు ప్రణాళికలు రచిస్తున్నది.
భారతదేశపు అతిపెద్ద రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని హౌరా జంక్షన్. ఇక్కడ 23 ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. ప్రతిరోజూ సుమారు 600కుపైగా రైళ్లు నడుస్తుండగా, దాదాపు 10.5 లక్షల మందికిపైగా ఈ స్టేషన్ నుంచి ప్రయాణిస్తున్నారు. 1854లో నిర్మించిన ఈ స్టేషన్ దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానమై ఉన్నది.

హౌరా జంక్షన్ స్టేషన్ అద్భుతమైన డిజైన్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఎర్ర-ఇటుక హౌరా రైల్వే స్టేషన్ అనేది సాంప్రదాయ వాస్తుశిల్పం, వలస, స్థానిక శైలుల కలయికతో కూడిన అద్భుతమైన భవనానికి బ్రిటిష్ ఆర్కిటెక్ట్ హాల్సే రికార్డో దీనిని రూపొందించారు. 1850లో నిర్మాణం ప్రారంభించారు. 1854 ఆగస్టు 15న హౌరా-హుగ్లీ మధ్య మొదటిసారి రైలు నడిచింది. గ్రీన్ రైల్వే స్టేషన్ అనే ట్యాగ్ ఉన్న ఇందులో అన్ని భద్రతప్రమాణాలు, అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. స్టేషన్‌లో మ్యూజియం కూడా ఉండటం గమనార్హం.

ఈ రైల్వే స్టేషన్‌ను అత్యంత రద్దీగా ఉండే ప్లాట్‌ఫారమ్‌గా కూడా పిలుస్తారు. ఇక్కడి నుంచి ప్రతిరోజూ 10.8 లక్షల మందికిపైగా ప్రయాణికులు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణిస్తున్నారు. 1854లో ఒకే ప్లాట్‌ఫామ్‌తో ప్రారంభమైన ఈ స్టేషన్.. 1905లో మరో ఆరు ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1984లో కొత్తగా 8 ప్లాట్‌ఫారమ్‌లను ఏర్పాటు చేయడంతో వాటి సంఖ్య 15కు చేరింది. 1992లో మరో నాలుగు ఏర్పాటు చేసినప్పటికీ.. రద్దీకి అనుగుణంగా 2009లో ఈ స్టేషన్‌ను మరింత విస్తరించారు. దీంతో ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య 23కు చేరింది. తాజాగా మరో ఐదేండ్లలో ఈ చారిత్రక స్టేషన్‌లో వసతులను రెట్టింపు చేయాలని రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

R. G. Kar Medical College | సందీప్ ఘోష్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి.. ఆర్జీకర్ కేసులో బిగుస్తున్న ఉచ్చు
మే 19, 2026

West Bengal Annapurna Scheme | బెంగాల్ సర్కార్ భారీ నజరానా: మహిళలకు నెలకు రూ.3000, ఉచిత బస్సు ప్రయాణం!
మే 18, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



