త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dalai Lama | ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ద‌లైలామా పేరు.. 169 సార్లు ప్రస్తావన..!

Dalai Lama | అమెరికాలో ఫైనాన్షియ‌ర్ జెఫ్రీ ఎప్‌స్టీన్‌ (Jeffrey Epstein) సెక్స్ కుంభ‌కోణం కేసు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఫైల్స్‌కు సంబంధించిన 30 లక్షల పేజీలను అమెరికా న్యాయశాఖ గ‌త‌వారం విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. టిబెట్ బౌద్ధ‌మ‌త గురువు ( Tibetan spiritual leader) 14వ ద‌లైలామా (Dalai Lama) పేరు కూడా ఈ పేజీల్లో ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ట్లు తెలిసింది.

D

National | Published On Feb 7, 2026, 1.32 pm IST

Dalai Lama | ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ద‌లైలామా పేరు.. 169 సార్లు ప్రస్తావన..!
Advertisement

Dalai Lama | అమెరికాలో ఫైనాన్షియ‌ర్ జెఫ్రీ ఎప్‌స్టీన్‌ (Jeffrey Epstein) సెక్స్ కుంభ‌కోణం కేసు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఎప్‌స్టీన్ (Epstein files) పేరు వింటేనే ప్ర‌పంచ నాయ‌కులు గ‌డ‌గ‌డ‌లాడుతున్నారు. ఈ ఫైల్స్‌కు సంబంధించిన 30 లక్షల పేజీలను అమెరికా న్యాయశాఖ గ‌త‌వారం విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఎప్‌స్టీన్‌ సన్నిహితుల జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) సహా మాజీ అధ్యక్షులు, రాజకీయ, వ్యాపార వేత్తలు, సినీ ప్ర‌ముఖులు, జ‌ర్న‌లిస్టులు ఉన్నారు. భార‌త్‌కు చెందిన ప‌లువురు సినీ ప్ర‌ముఖుల పేర్లు కూడా తాజాగా విడుద‌లైన పేజీల్లో ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ట్లు తేలింది. అయితే, ఇప్పుడు ఓ షాకింగ్ విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

టిబెట్ బౌద్ధ‌మ‌త గురువు ( Tibetan spiritual leader) 14వ ద‌లైలామా (Dalai Lama) పేరు కూడా ఈ పేజీల్లో ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ట్లు తెలిసింది. ఇటీవల అమెరికా విడుదల చేసిన 30 లక్షల ఎప్‌స్టీన్‌ ఫైళ్లలో 2 వేల వీడియోలు, 18 వేల ఫొటోలు కూడా ఉన్నాయి.ఫైళ్లలో దలైలామా పేరు కనీసం 169 సార్లు కనిపించిన‌ట్లు అంత‌ర్జాతీయ మీడియా క‌థ‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. అక్టోబ‌ర్ 21, 2012న వ‌చ్చిన ఈమెయిల్‌లో ఎప్‌స్టీన్ ద‌లైలామా పేరును ప్ర‌స్తావించారు. ఓ ద్వీపంలో జ‌రిగే కార్య‌క్ర‌మానికి ద‌లైలామా వ‌స్తున్నార‌ని.. ఆ కార్య‌క్రామానికి తాను కూడా వెళ్తున్న‌ట్లు ఎప్‌స్టీన్ ఓ వ్య‌క్తికి ఈ మెయిల్ పంపాడు. ఈ విష‌యం తాజాగా విడుద‌లైన ఫైల్స్ ద్వారా బ‌య‌ట‌ప‌డింది. సెక్స్ కుంభ‌కోణానికి సంబంధించిన ఫైల్స్‌లో బౌద్ధ‌మ‌త గురువు పేరు ప్ర‌స్తావ‌న‌కు రావ‌డం ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అందుబాటులోకి 30 ల‌క్ష‌ల పేజీలు..

ఇటీవల అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (DOJ) చట్టబద్ధంగా విడుదల చేసిన 30.5 లక్షల పేజీల డాక్యుమెంట్లు, 1.8 లక్షల ఫోటోలు, 2,000 కు పైగా వీడియోలు ఇప్పుడు jmail.world ద్వారా అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఈ పత్రాలు వెలుగులోకి రావడంతో పదేళ్ల క్రితం జరిగిన నేరాలు, తెరవెనుక సాగిన చీకటి ఒప్పందాలు బయటపడుతున్నాయి. నిన్నటి వరకు గుప్తంగా ఉన్న సంచలన నిజాలు ఇప్పుడు ప్రపంచం ముందు బహిర్గతమవడంతో ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, వ్యాపార, రాజకుటుంబ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ మొత్తం సమాచారాన్ని jmail.world అనే వెబ్‌సైట్‌లో పబ్లిక్‌గా ఉంచడం వల్ల, సామాన్యుల నుంచి నిపుణుల వరకు ప్రతి ఒక్కరూ వీటిని పరిశీలించే అవకాశం కలిగింది. దీనివల్ల ఇన్నాళ్లూ అధికార బలంతో దాచిన నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

ట్రంప్ నుంచి మ‌స్క్ వ‌ర‌కూ..

ఎప్‌స్టీన్ ఫ్రెండ్స్ లిస్ట్‌లో అనేక మంది ప్ర‌ముఖులు ఉన్నారు. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump), మాజీ అధ్యక్షుడు క్లింటన్స్, ప్ర‌పంచ కుబేరుడు ఎలాన్ మ‌స్క్‌ (Elon Musk), మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ (Bill Gates), ప్రిన్స్ ఆండ్రూ, బ్రిటన్ మాజీ రాయబారి పీటర్ మాండెల్సన్ స‌హా ప‌లువురి పేర్లు ఉన్నాయి.

Advertisement
Advertisement