Andrew | ఎప్‌స్టీన్ ఫైల్స్ కేసులో కీలక పరిణామం.. కింగ్ చార్లెస్ సోదరుడు ఆండ్రూ అరెస్ట్
Andrew | అమెరికా ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ (Jeffrey Epstein) సెక్స్ కుంభకోణం కేసు (Epstein Files)లో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. బ్రిటన్ రాజు చార్లెస్ (King Charles) సోదరుడు, మాజీ యువరాజు ఆండ్రూ (Andrew)ని తాజాగా పోలీసులు అరెస్ట్ చేసినట్లు (Andrew Arrested) తెలిసింది.
International | Published On Feb 19, 2026, 4.12 pm IST
Andrew | ప్రపంచ రాజకీయాలను కుదిపేస్తోన్న అమెరికా ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ (Jeffrey Epstein) సెక్స్ కుంభకోణం కేసు (Epstein Files)లో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. జెఫ్రీతో బ్రిటన్ రాజు చార్లెస్ (King Charles) సోదరుడు, మాజీ యువరాజు ఆండ్రూ (Andrew)కి సంబంధాలు ఉన్నట్లు ఇటీవలే బయటపడిన విషయం తెలిసిందే. ఈ వివాదం వేళ ఆండ్రూని తాజాగా పోలీసులు అరెస్ట్ చేసినట్లు (Andrew Arrested) తెలిసింది. థేమ్స్ వ్యాలీ పోలీసులు ఆండ్రూని అదుపులోకి తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదిస్తోంది. ప్రస్తుతం అతను పోలీసుల కస్టడీలో ఉన్నట్లు సమాచారం.
కాగా, ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించి విడుదలైన ఫైల్స్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సహా, మాజీ అధ్యక్షులు, రాజకీయ, వ్యాపార వేత్తలు కూడా ఉన్నట్లు ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసు పత్రాల్లో బ్రిటన్ యువరాజు ఆండ్రూ (Prince Andrew) పేరు కూడా బయటకొచ్చింది. అమెరికాకు చెందిన వర్జినియా గిఫ్రే అనే బాధితురాలు ఆండ్రూపై లైంగిక ఆరోపణలు చేసింది.
తనను 2019 లో సెక్స్ కోసం బ్రిటన్ యువరాజు ఆండ్రూకు అప్పుగా ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ ఇచ్చాడని తన ఫిర్యాదులో పేర్కొంది. ఫైనాన్షియర్ జెఫ్రీ ఎఫ్‌స్టీన్ 2019 లో న్యూయార్క్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. 20 ఏండ్ల క్రితం తాను 18 ఏండ్ల కన్నా తక్కువ వయసులో ఉన్నప్పుడు లండన్ సోషియల్ జిస్లైన్ మాక్స్‌వెల్ ఇంట్లో తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది. ఎప్‌స్టీన్ ఇంటితోపాటు వర్జిన్ దీవుల్లోని లిటిల్ సెయింట్ జేమ్స్ దీవిలో కూడా ఆండ్రూ తనను దుర్భాషలాడారని గిఫ్రే పేర్కొన్నది. అయితే, ఈ ఆరోపణలను ఆండ్రూ ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూ వస్తున్నారు. ఆమె ఎవరో కూడా తనకు తెలియదని, ఎప్పుడూ కలువలేదని పేర్కొన్నారు.
ఇక లైంగిక ఆరోపణల నేపథ్యంలో ప్రిన్స్ ఆండ్రూ రాయల్ టైటిల్‌ను కూడా కోల్పోయిన విషయం తెలిసిందే. జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తన తమ్ముడు ప్రిన్స్ ఆండ్రూని అన్ని రాచరిక హోదాలు, గౌరవాల నుంచి బ్రిటన్ రాజు చార్లెస్-3 తప్పించినట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ ఇటీవలే ప్రకటించింది. అంతేగాక ఆండ్రూ విండ్సర్‌లోని తన విలాసవంతమైన భవనం రాయల్ లాడ్జీని కూడా ఖాళీ చేయాలని కింగ్ చార్లెస్ ఆదేశించారు. దీంతో ప్రస్తుతం ఆ బంగ్లాను ఆండ్రూ ఖాళీ చేసి వేరేచోటుకు షిఫ్ట్ అయ్యాడు.
సంబంధిత వార్తలు

Melania Trump | అబద్ధాలకు నేటితో ముగింపు పలకాలి.. ఎప్‌స్టీన్‌తో సంబంధాలపై మెలానియా ట్రంప్
ఏప్రిల్ 10, 2026

Epstein Files | మనుషుల జ్ఞాపకాలను ఎప్‌స్టీన్ చెరిపివేశాడా..? MIT ప్రముఖుడితో సంభాషణ..
ఫిబ్రవరి 20, 2026

Bill Gates | ఎప్‌స్టీన్ ఫైల్స్ సెగ.. ఏఐ సమ్మిట్‌లో బిల్ గేట్స్ ప్రసంగం రద్దు
ఫిబ్రవరి 19, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



