త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

13 Of Family Jailed | ప‌దేళ్లనాటి కేసు.. ఒకే కుటుంబానికి చెందిన 13 మందికి జీవిత ఖైదు

13 Of Family Jailed | ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో (UP) పదేళ్ల క్రితం సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో స్థానిక కోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది. భూ వివాదం (Land Dispute) నేపథ్యంలో ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన కేసులో ఒకే కుటుంబానికి చెందిన 13 మందిని దోషులుగా తేల్చింది.

D

National | Published On Feb 24, 2026, 11.21 am IST

13 Of Family Jailed | ప‌దేళ్లనాటి కేసు.. ఒకే కుటుంబానికి చెందిన 13 మందికి జీవిత ఖైదు
Advertisement

13 Of Family Jailed | ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో (UP) పదేళ్ల క్రితం సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో స్థానిక కోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది. భూ వివాదం (Land Dispute) నేపథ్యంలో ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన కేసులో ఒకే కుటుంబానికి చెందిన 13 మందిని దోషులుగా తేల్చింది. వారికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. శిక్షతో పాటు అందరికీ కలిపి రూ. 10.73 లక్షల జరిమానా కూడా విధించినట్లు అదనపు జిల్లా ప్రభుత్వ న్యాయవాది దీపక్ సైనీ తెలిపారు.

ఇవీ కేసు వివ‌రాలు..

సహరాన్‌పూర్ (Saharanpur)లో 2016 న‌వంబ‌ర్ 12న 20 బిఘాల భూమికి సంబంధించి వివాదం చెల‌రేగింది. ఈ వివాదంలో ఇద్ద‌రు సోద‌రుల‌ను హ‌త్య చేసిన‌ట్లు ఇస్రార్ అనే వ్య‌క్తి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కొంద‌రు వ్య‌క్తులు త‌మ ఇంట్లోకి చొర‌బ‌డి దాడి చేసిన‌ట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. త‌మ వ్య‌వ‌సాయ భూమిని క‌బ్జా చేసేందుకు కొంద‌రు ప్ర‌య‌త్నించిన‌ట్లు చెప్పాడు. ఈ విష‌యంలోనే త‌మ ఇంటిపై దాడికి వ‌చ్చార‌న్నారు. ఈ దాడిలో త‌న తండ్రి య‌మీన్‌, బాబాయ్ త‌సీన్‌ల‌ను కొంద‌రు హ‌త్య చేసిన‌ట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ కేసుపై స్థానిక కోర్టులో ప‌దేళ్లుగా విచార‌ణ సాగుతోంది.

ఈ క్ర‌మంలోనే ఈ కేసుపై విచార‌ణ జ‌రిపిన కోర్టు.. ఒకే కుటుంబానికి చెందిన 13 మందిని దోషులుగా తేల్చింది. వారికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. శిక్ష పడిన వారిలో సుబ్బా అనే వ్యక్తి నలుగురు కుమారులు మునవర్, ముస్తఫా, సనవర్, స్తఖీమ్‌లతో పాటు ముస్తఫా ఇద్దరు కుమారులు షౌకీన్, మోహ్సిన్‌ కూడా ఉన్నారు. ఒకే కేసులో ఒకే కుటుంబానికి చెందిన ఇంతమందికి యావజ్జీవ శిక్ష పడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Advertisement
Advertisement