Cold Storage Facility Collapse | కుప్పకూలిన కోల్డ్ స్టోరేజీ బిల్డింగ్.. అమ్మోనియా గ్యాస్ లీక్.. ఐదుగురు మృతి
వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు అగ్ని మాపక యంత్రాలు గ్యాస్‌పై నీటిని చల్లాయి.
Cold Storage Facility Collapse | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న ఫాఫామ్ ఏరియాలో విషాదం చోటు చేసుకుంది. కోల్డ్ స్టోరేజ్ బిల్డింగ్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఐదుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు. భవనం కూలిన వెంటనే ఆ భవనంలో ఉన్న అమ్మోనియా గ్యాస్ ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అయి బయటికి రావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు. సహాయక చర్యలకు కూడా విఘాతం కలిగింది.
శిథిలాల కింద చిక్కుకుపోయిన సిబ్బంది
ఒక్కసారిగా కోల్డ్ స్టోరేజీ బిల్డింగ్ కుప్పకూలడంతో అందులో పనిచేసే సిబ్బంది బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకుపోయారు. సహాయక సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న 9 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరికొంత మంది శిథిలాల్లో చిక్కుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే అన్సార్ అహ్మద్‌కు చెందిన కోల్డ్ స్టోరేజ్ అని తెలుస్తోంది.

వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు అగ్ని మాపక యంత్రాలు గ్యాస్‌పై నీటిని చల్లాయి. ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






