momos | మోమూస్‌కు అడిక్ట్ అయిన బాలుడు.. వాటి కోసం ఇంట్లోని బంగారాన్నే దొంగిలించాడు..
momos | ఒకప్పుడు ఈవినింగ్ స్నాక్స్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది పానీ పూరీ, నూడిల్స్, మ్యాగీ, గోబీనే. కానీ ఇప్పుడు అందరూ మోమూస్‌నే ఎక్కువగా తినేందుకు ఇష్టపడుతున్నారు.
momos | ఒకప్పుడు ఈవినింగ్ స్నాక్స్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది పానీ పూరీ, నూడిల్స్, మ్యాగీ, గోబీనే. కానీ ఇప్పుడు అందరూ మోమూస్‌నే ఎక్కువగా తినేందుకు ఇష్టపడుతున్నారు. వెజ్, నాన్‌వెజ్ ఫ్లేవర్స్‌లో దొరికే ఈ మోమూస్‌ను స్ట్రీట్ ఫుడల్ లవర్స్ ఎంతో ఇష్టంగా తింటున్నారు. అయితే, ఈ మోమూస్ (momos)కు అడిక్ట్ అయిన ఓ బాలుడి నిర్వాకం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. యూపీ డియోరియా (Deoria) జిల్లాకు చెందిన ఏడో తరగతి విద్యార్థి మోమూస్‌కు అలవాటుపడ్డాడు. అయితే రోజు వాటిని కొనుక్కునేందుకు ఆ విద్యార్థి వద్ద డబ్బు ఉండేది కాదు. కానీ తినాలన్న కోరిక అతడు దొంగతనానికి పాల్పడేలా చేసింది. మోమూస్ కోసం సదరు విద్యార్థి ఇంట్లో బీరువాలో ఉన్న రూ.లక్షలు విలువ చేసే ఆభరణాలు దొంగిలించాడు. వాటిని తీసుకెళ్లి మోమూస్ అమ్మే వ్యక్తికి ఇచ్చి తనకు కావల్సిన మోమూస్‌ను ఫ్రీగా తీసుకుని తినేవాడు. ఇలా ఇంట్లోని రూ.80 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు రోజుకొకటి దొంగిలించి మోమూస్ అమ్మే వ్యక్తికి ఇచ్చేశాడు.
ఓ రోజు ఇంట్లో వాళ్లు నగలు మాయమైన విషయాన్ని గుర్తించారు. నగల గురించి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. మోమూస్ కోసం తానే నగలు దొంగిలించినట్లు బాలుడు ఇంట్లో వాళ్ల ముందు నిజం ఒప్పుకున్నాడు. అతడి మాటలకు తల్లిదండ్రులు ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కొడుకు బలహీనతను అడ్డుపెట్టుకొని మోమూస్ అమ్ముకునే వ్యక్తి నగలు కాజేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మోమూస్ అమ్ముకునే వ్యక్తిని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్





