త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rahu Transit 2026 | నేటి మ‌క‌ర రాశిలోకి రాహువు సంచారం.. నాలుగు రాశులకు ఆర్థికంగా కలిసిరానున్న కాలం!

Rahu Transit 2026 | జ్యోతిష్య శాస్త్రంలో రాహు, కేతువుల సంచారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఈ రెండు గ్రహాల స్థాన మార్పులు మొత్తం 12 రాశుల వారి జీవితాలపై ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో నేడు రాహువు తన రాశిని మార్చుకోనున్నాడు. అదే రోజు కేతువు కూడా మరో రాశిలోకి ప్రవేశించనున్నాడు.

P

Horoscope | Published On Nov 25, 2026, 6.30 am IST

Rahu Transit 2026 | నేటి మ‌క‌ర రాశిలోకి రాహువు సంచారం.. నాలుగు రాశులకు ఆర్థికంగా కలిసిరానున్న కాలం!
Advertisement

Rahu Transit 2026 | జ్యోతిష్య శాస్త్రంలో రాహు, కేతువుల సంచారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఈ రెండు గ్రహాల స్థాన మార్పులు మొత్తం 12 రాశుల వారి జీవితాలపై ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో నేడు రాహువు తన రాశిని మార్చుకోనున్నాడు. అదే రోజు కేతువు కూడా మరో రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ గ్రహాల సంచారం నాలుగు రాశుల వారికి అనుకూల ఫలితాలను తీసుకురావచ్చని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ వ్యవహారాల్లో సానుకూల మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. ఇంతకీ ఆ నాలుగు రాశులేవి? రాహు సంచారంతో వారికి కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం రండి..!

రాహు, కేతువుల రాశుల మార్పు..

జ్యోతిష్య వివరాల ప్రకారం.. బుధ‌వారం (న‌వంబ‌ర్‌ 25న) సాయంత్రం 4:34 గంటలకు రాహువు మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. అదే సమయంలో కేతువు చంద్రుడికి సంబంధించిన కర్కాటక రాశిలోకి మారనున్నాడు. ఈ గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి ఆర్థిక పురోగతికి అవకాశాలు ఏర్పడతాయని పండితులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభం కావడం, కొత్త ఉద్యోగ అవకాశాలు రావడం, వ్యాపారంలో లాభదాయకమైన ఒప్పందాలు కుదరడం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చని అంచనా. ఈ సంచారం వల్ల ప్రధానంగా మేషం, సింహం, వృశ్చికం, మీన రాశుల వారికి అనుకూల ఫలితాలు కలగవచ్చని చెబుతున్నారు.

మేష రాశి (Aries)

మేష రాశి వారికి రాహు సంచారం అనేక విషయాల్లో సానుకూల ఫలితాలను అందించే అవకాశముంది. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు తిరిగి వేగం పుంజుకుంటాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి విస్తరణకు సంబంధించిన కొత్త అవకాశాలు లభించవచ్చు. కొత్త పెట్టుబడులు పెట్టడం, వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరించడం వంటి విషయాల్లో ముందడుగు పడే సూచనలు ఉన్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. పనితీరుకు గుర్తింపు లభించడంతోపాటు పదోన్నతి లేదంటే స్థాన చ‌ల‌నం క‌లిగే అవ‌కాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన, సమన్వయం మెరుగ‌వుతుంది. చాలాకాలంగా కొనసాగుతున్న పాత విభేదాలు పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి. మొత్తంగా ఉద్యోగ, వ్యాపార, కుటుంబ వ్యవహారాల్లో మేష రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉండే అవ‌కాశం ఉంది.

సింహ రాశి (Leo)

సింహ రాశి వారికి రాహు సంచారం కొత్త అవకాశాలను తీసుకురావచ్చని తీసుకువ‌చ్చే అవ‌కాశాలున్నాయి. ముఖ్యంగా గత కొంతకాలంగా కష్టపడుతున్న పనులకు తగిన ఫలితాలు లభించే సూచనలు ఉన్నాయి. మధ్యలో నిలిచిపోయిన ప్రాజెక్టులు, పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. కీలకమైన వ్యవహారాల్లో విజయం సాధించేందుకు అనుకూల ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయి. ఆర్థిక విషయాల్లో కూడా సింహ రాశి వారికి ఊరట లభించే సూచనలు ఉన్నాయి. అనుకోని మార్గాల ద్వారా ధనలాభం కలగవచ్చని, దీంతో ఆర్థిక పరిస్థితి మరింత బ‌లోపేత‌మ‌వుతుంది. ఉద్యోగులకు తమ పనితీరుకు ప్రశంసలు, ఉన్నతాధికారుల నుంచి గుర్తింపు లభించే అవకాశముంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి పెద్ద ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి. ఈ ఒప్పందాలు భవిష్యత్తులో వ్యాపార అభివృద్ధికి దోహ‌ద‌ప‌డుతాయి.

వృశ్చిక రాశి (Scorpio)

వృశ్చిక రాశి వారికి రాహువు రాశి మార్పు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి మంచి రాబడులు వచ్చే అవకాశముంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న వ్యాపార ఒప్పందం కుదిరే సూచనలు కూడా ఉన్నాయి. దీంతో ఆదాయం పెరగడంతోపాటు ఆర్థిక పరిస్థితి మెరుగ‌వుతుంది. వ్యాపార అవసరాల కోసం చేసే ప్రయాణాలు ప్రయోజనకరంగా మారవచ్చు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడటం, వ్యాపార అవకాశాలు విస్తరించడం వంటి పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఆశించిన అవకాశాలు లభించవచ్చని అవ‌కాశాలు గోచ‌రిస్తున్నాయి. సరైన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి ఈ కాలం అనుకూలంగా ఉండవచ్చు. మొత్తంగా పెట్టుబడులు, వ్యాపారం, ఉద్యోగ ప్రయత్నాల విషయంలో వృశ్చిక రాశి వారు సానుకూల ఫలితాలుంటాయి.

మీన రాశి (Pisces)

మీన రాశి వారికి రాహు సంచారం సుఖసంతోషాలు, విలాసవంతమైన జీవనానికి సంబంధించిన విషయాల్లో అనుకూలంగా ఉండేందుకు అవ‌కాశాలున్నాయి. ముఖ్యంగా వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశముంది. ఇప్పటివరకు ఉన్న ఆదాయ మార్గాలకు అదనంగా కొత్త ఆదాయ వనరులు ఏర్పడవచ్చు. దీంతో ఆర్థికంగా మరింత స్థిరత్వం సాధించే అవకాశం ఉంది. ఉద్యోగులకు మెరుగైన హోదా, అధిక వేతనంతో కూడిన కొత్త ఉద్యోగ ఆఫర్లు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్నవారికి ఆశించిన అవకాశం లభించవచ్చు. కెరీర్‌లో ఎదగాలనుకునే వారికి కొత్త మార్గాలు తెరుచుకోవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లోనూ పురోగతి సాధించే అవకాశాలున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, ఆదాయం వంటి కీలక అంశాల్లో మీన రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంది.

రాహు గ్రహ అనుగ్రహం కోసం పాటించాల్సిన పరిహారాలు

జాతకంలో రాహు గ్రహానికి సంబంధించిన ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి కొన్ని పరిహారాలు పాటించాలని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది. శనివారం రోజున కుక్కలకు రొట్టెలు లేదా ఆహారం పెట్టడం శుభప్రదంగా భావిస్తారు. రాహు సంబంధిత పరిహారంగా ఇనుప ఉంగరం, బ్రాస్‌లెట్ ధరించాలని కొందరు జ్యోతిష్యులు సూచిస్తున్నారు. ధరించే ముందు అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకోవ‌డం మంచిది. ఆర్థిక స్థోమతను బట్టి పేదలకు ధాన్యాలు, దుస్తులు, నిత్యావసర వస్తువులు దానం చేయాలి. శనివారం సాయంత్రం రావిచెట్టు కింద ఆవ నూనె, నువ్వుల నూనెతో దీపం వెలిగించడం శ్రేయ‌స్క‌రం. మాంసాహారం, మద్యపానం, తామసిక ఆహారానికి దూరంగా ఉండాల‌ని పండితులు సూచిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement