త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | జాతీయ ర‌హ‌దారిపై ట్ర‌క్కు బీభ‌త్సం.. 11 మంది దుర్మ‌ర‌ణం

Road Accident | ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మీర్జాపూర్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) జ‌రిగింది. వార‌ణాసి-రెవా జాతీయ ర‌హ‌దారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ ట్ర‌క్కు మీర్జాపూర్ (Mirzapur) స‌మీపంలో అదుపుత‌ప్పి లారీ, ఆల్టో కారు, బొలెరోని ఢీకొట్టింది.

G

National | Published On Apr 23, 2026, 6.26 am IST

Road Accident | జాతీయ ర‌హ‌దారిపై ట్ర‌క్కు బీభ‌త్సం.. 11 మంది దుర్మ‌ర‌ణం
Advertisement

Road Accident | త్రినేత్ర‌.న్యూస్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మీర్జాపూర్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) జ‌రిగింది. వార‌ణాసి-రెవా జాతీయ ర‌హ‌దారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ ట్ర‌క్కు మీర్జాపూర్ (Mirzapur) స‌మీపంలో అదుపుత‌ప్పి లారీ, ఆల్టో కారు, బొలెరోని ఢీకొట్టింది. దీంతో బొలెరోలో మంట‌లు చెల‌రేగాయి. అందులో ఉన్న 11 మంది స‌జీవ ద‌హ‌ణ‌మ‌య్యారు.

ఈ ఘ‌ట‌న బుధ‌వారం రాత్రి 8.30 గంట‌ల‌కు జ‌రిగింద‌ని సీనియ‌ర్ పోలీసు అధికారి అప‌ర్ణా ర‌జ‌త్ కౌశిక్‌ తెలిపారు. మొత్తం 11 మంది మ‌ర‌ణించార‌ని చెప్పారు. ట్ర‌క్కు డ్రైవ‌ర్ తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌న్నారు. ట్ర‌క్కుకు బ్రేకులు విఫ‌ల‌మ‌వ‌డమే ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని వెల్ల‌డించారు. ట్ర‌క్కుపై అదుపు కోల్పోయిన డ్రైవ‌ర్ మొద‌ట ఓ ఆల్టోకారును ఢీకొట్టార‌ని, దీంతో అది రెండు లారీల మ‌ధ్య ఇరుక్కుపోయింద‌ని చెప్పారు. అనంత‌రం ఓ లారీని, బొలెరో వాహ‌నాన్ని, మ‌రో లారీని ఢీకొట్టి ఆగిపోయింద‌న్నారు. మృతుల‌ను ఇంకా గుర్తించ‌లేద‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు.

Advertisement
Advertisement