దక్షిణాఫ్రికాలో తెలంగాణ యువకుడి కిడ్నాప్
దక్షిణాఫ్రికాలోని మాలి దేశంలో బోర్ వెల్ కంపెనీలో పని చేస్తున్న తెలంగాణలోని భువనగిరికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు కిడ్నాప్‌నకు గురయ్యాడు. ఉపాధి కోసం ప్రవీణ్ గత సంవత్సరం ఆఫ్రికాకు వెళ్లాడు. యాదాద్రి భువనగిరి జిల్లా బండసోమారం గ్రామం అతడిది. హైదరాబాద్ లోని ఓ బోర్ వెల్ కంపెనీలో పని చేస్తున్న ప్రవీణ్ ను గత సంవత్సరం కంపెనీ పని మీద ఆఫ్రికాలోని మాలికి పంపించింది. అప్పటి నుంచి అక్కడే పని చేస్తున్నాడు. గత నెల 22 వ తేదీ నుంచి ప్రవీణ్ ఫోన్ స్విచ్ఆఫ్ వస్తోంది. దీంతో ఆందోళనకు గురైన అతడి తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలుపోలేదు.
మాలిలోని కోబ్రి ప్రాంతంలో విధులకు వెళ్లిన ప్రవీణ్ ను గత నెల 23న జేఎన్ఐఎం సంస్థకు చెందిన ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న బోర్ వెల్ యాజమాన్యం.. అతడి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చేరవేసింది. అలాగే భారత రాయబార కార్యాలయంతో బోర్ వెల్ కంపెనీ యాజమాన్యం ప్రవీణ్ గురించి సంప్రదింపులు జరుపుతోంది.
ఈ సంస్థ ఇప్పటికే చాలా సార్లు పలువురు విదేశీయులను కిడ్నాప్‌నకు గురి చేసినట్లు తెలుస్తోంది. వాళ్ల మోటివ్ ఏంటి? ఎందుకు ప్రవీణ్ ను కిడ్నాప్ చేశారు? అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. ఉగ్రవాదుల చెర నుంచి తమ బిడ్డను కాపాడాలని ప్రవీణ్ తల్లిదండ్రులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Horoscope | మే 22, శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Horoscope | మే 22, శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్



