YeshaNagula Song | ఆ ఫీట్ అందుకున్న తొలి తెలుగు పాటగా ఏష నాగుల.. దీ ప్యారడైజ్ టికెట్ ధరల పెంపుపై క్లారిటీ
YeshaNagula Song | విడుదల కు సిద్ధమవుతున్న ది ప్యారడైజ్ (The Paradise) మూవీలోని పాటలు యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. Nani హీరోగా, శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
YeshaNagula Song | త్రినేత్ర.న్యూస్: విడుదల కు సిద్ధమవుతున్న ది ప్యారడైజ్ (The Paradise) మూవీలోని పాటలు యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. Nani హీరోగా, శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ నుంచి విడుదలైన ఆయా షేర్ సాంగ్ ఇప్పటికే యూట్యూబ్‌ను ఊపేసిన విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన `ఏష నాగుల` (YeshaNagula Song) పాట సంచలనం సృష్టిస్తున్నది.
కీర్తి సురేశ్, నాని తమ మాస్ స్టెప్పులతో ఇరగదీసిన ఈ పాట విడుదలైన నాటినుంచే మిలియన్ల వ్యూస్ తో, లక్షలకొద్దీ లైక్స్‌తో దూసుకుపోతున్నది. ఇప్పటికే యూట్యూబ్ (YouTube)లో 5 రోజుల్లోనే 50+ మిలియన్ వ్యూస్ రాబట్టి, అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న తొలి తెలుగు పాటగా రికార్డు సృష్టించింది. అదేవూపులో తక్కువ వ్యవధిలో 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన ఫస్ట్ తెలుగు పాటగా తాజాగా మరో రికార్డును నమోదు చేసింది. కేవలం 18 రోజుల్లో 10.2 కోట్ల వ్యూస్ దక్కించుకుంది.

టికెట్ ధరల పెంపుపై క్లారిటీ
మరోవైపు ప్యారడైజ్ సినిమా టికెట్ ధరలు ( Tick Price Hike) పెంచుతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్నది. సినిమాకున్న విపరీతమైన హైప్‌ను క్యాష్ చేసుకునేందుకు నిర్మాతలు చూస్తున్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తున్నది. దీంతో ఈ ప్రచారాన్ని సినిమా యూనిట్ కండించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. అవన్నీ పుకార్లేనని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతానికి ఆ ఆలోచనే లేదని తేల్చిచెప్పింది. దీంతో నాని ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. కాగా, ఇటీవల విడుదలైన రవితేజ `ఇరుముడి` సినిమా టికెట్ ధరలు పెంచకుండానే భారీ విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..
సెప్టెంబర్ 16, 2026

Paidi Rakesh Reddy | ఆర్మూర్ గోస పట్టకపోతే ఇయ్యాల్నే రాజీనామా జేస్త
సెప్టెంబర్ 16, 2026

Abortion Pills | ఐదునెలల పరిచయం.. యువకుడితో లైంగిక సంబంధం.. గర్భనిరోధక మాత్రలు వికటించి యువతి మృతి
సెప్టెంబర్ 16, 2026
తాజావార్తలు
- ●Paidi Rakesh Reddy | ఆర్మూర్ గోస పట్టకపోతే ఇయ్యాల్నే రాజీనామా జేస్త
- ●Abortion Pills | ఐదునెలల పరిచయం.. యువకుడితో లైంగిక సంబంధం.. గర్భనిధక మాత్రలు వికటించి యువతి మృతి
- ●Stock Markets | భారీ పతనం తర్వాత మార్కెట్లకు ఊరట.. 300 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..
- ●Pochampally Srinivas Reddy | లండన్ పర్యటనలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.. ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ నేతల ఘన స్వాగతం
- ●CPRI Recruitment | సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 112 ఉద్యోగాలు.. ఇంజినీరింగ్, డిప్లొమా అభ్యర్థులు అర్హులు
- ●US Tariffs | భారత్‌పై అమెరికా 100 శాతం టారీఫ్‌లు.. తుదిదశకు బిల్లు

Paidi Rakesh Reddy | ఆర్మూర్ గోస పట్టకపోతే ఇయ్యాల్నే రాజీనామా జేస్త

Abortion Pills | ఐదునెలల పరిచయం.. యువకుడితో లైంగిక సంబంధం.. గర్భనిధక మాత్రలు వికటించి యువతి మృతి

Stock Markets | భారీ పతనం తర్వాత మార్కెట్లకు ఊరట.. 300 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..

Pochampally Srinivas Reddy | లండన్ పర్యటనలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.. ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ నేతల ఘన స్వాగతం



