Stock Markets | భారీ పతనం తర్వాత మార్కెట్లకు ఊరట.. 300 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..
Stock Markets | గత సెషన్‌లో భారీ అమ్మకాలతో కుదేలైన భారత స్టాక్ మార్కెట్లు బుధవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్ 15, 16న నిర్వహిస్తున్న పాలసీ సమావేశం నేపథ్యంలో సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ 23,200 స్థాయిని అధిగమించింది.
Stock Markets | గత సెషన్‌లో భారీ అమ్మకాలతో కుదేలైన భారత స్టాక్ మార్కెట్లు బుధవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్ 15, 16న నిర్వహిస్తున్న పాలసీ సమావేశం నేపథ్యంలో సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ 23,200 స్థాయిని అధిగమించింది. అమెరికా బాండ్ ఈల్డ్స్ అధికంగా ఉండడం, ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ దేశీయ మార్కెట్లు గ్యాప్ అప్‌తో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ గత సెషన్ ముగింపు 74,003.82తో పోలిస్తే బుధవారం 74,249.31 వద్ద ప్రారంభమైంది. ఉదయం ట్రేడింగ్‌లో సుమారు 74,388.37 వద్ద కొనసాగుతూ 384.55 పాయింట్లు ( 0.52 శాతం) లాభపడింది. మరోవైపు నిఫ్టీ మునుపటి ముగింపు 23,118.60తో పోలిస్తే 23,201.60 వద్ద ప్రారంభమై, సుమారు 23,244.30 వద్ద ట్రేడవుతూ 125.70 పాయింట్లు (0.54 శాతం) లాభపడింది.
ఎండీఆర్ ఎఫెక్ట్.. పెరిగిన పేమెంట్ కంపెనీల షేర్ల..
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో నెస్లే, ఐటీసీ, ఎస్‌బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్, హిందుస్థాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్, పవర్ గ్రిడ్, కోటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ట్రెంట్, బీఈఎల్, హిందాల్కో తదితర షేర్లు ఉదయం ట్రేడింగ్‌లో లాభాల్లో కొనసాగాయి. విప్రో, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ తదితర షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఐటీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, బీఈఎల్, ట్రెంట్, రిలయన్స్, హిందుస్థాన్ యూనిలీవర్, టెక్ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర షేర్లు లాభాల్లో ఉండగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండిగో, టాటా స్టీల్ తదితర షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. తాజా ఎండీఆర్ నిబంధనల అమలు నేపథ్యంలో పేమెంట్ కంపెనీల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఉదయం 9:29 గంటల సమయంలో పేటీఎం షేరు 35.95 పాయింట్లు (2.08 శాతం) లాభంతో ఒక్కో షేరుకు రూ.1,767.05 వద్ద ట్రేడయింది. మరోవైపు మొబిక్విక్ షేరు 1.95 పాయింట్లు (0.97 శాతం) లాభంతో రూ.203.90 వద్ద కొనసాగింది.
తగ్గిన చమురు ధరలు..
రంగాల వారీగా చూస్తే అత్యధిక సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయి. అయితే నిఫ్టీ రియాల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్ సూచీలు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. విస్తృత మార్కెట్‌లకు చెందిన చాలా సూచీలు కూడా లాభాల్లోనే కొనసాగాయి. కమోడిటీ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు సుమారు 108.06 అమెరికన్ డాలర్ల వద్ద ట్రేడయింది. క్రూడ్ ఆయిల్ ధర సుమారు 104.69 డాలర్లుగా ఉంది. మార్కెట్ విశ్లేషకుడు విపిన్ దిక్సేనా మాట్లాడుతూ మంగళవారం భారీ అమ్మకాల తర్వాత మార్కెట్ రికవరీతో ప్రారంభమవడం ప్రోత్సాహకరంగా ఉందని అన్నారు. అయితే దీన్ని ఇప్పుడే ట్రెండ్ రివర్సల్‌గా భావించకూడదని పేర్కొన్నారు. మంగళవారం అమ్మకాలు విస్తృతంగా కనిపించడంతోపాటు అంతర్జాతీయ పరిస్థితులు కూడా సవాలుగా ఉన్నాయని తెలిపారు.
సంబంధిత వార్తలు

Stock Markets | ఊహించినట్లే జరిగింది.. స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్.. రూ.9 లక్షల కోట్లు ఆవిరి..
సెప్టెంబర్ 15, 2026

Stock Markets | ఐటీ స్టాక్స్ దూకుడు.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
సెప్టెంబర్ 15, 2026

IPO | ఐపీవోలో పెట్టుబడి పెట్టేముందు గమనించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే.. లేదంటే భారీ నష్టమే..
సెప్టెంబర్ 14, 2026
తాజావార్తలు
- ●Kunamneni Sambasiva Rao | 22A ద్వారా కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టడం అవాస్తవం
- ●Helicopter Crash | బస్సు ప్రమాదాన్ని కవర్ చేసేందుకు వెళ్లి.. కూలిపోయిన మీడియా హెలికాప్టర్
- ●Jio | జియో యూజర్లకు గుడ్‌న్యూస్.. ఏడాది పాటు కాన్వా ప్రొ ఉచితం..
- ●Tummala Nageswara Rao | ఆయిల్‌పామ్‌కు సంబంధించి మార్కెటింగ్, ఎగుమతుల సమస్య లేదు: మంత్రి తుమ్మల
- ●Bhatti Vikramarka | విద్యుత్ పొదుపే మరో పవర్ ప్లాంట్
- ●Telangana Congress | ఈ నెల 18న తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంచార్జి..!

Kunamneni Sambasiva Rao | 22A ద్వారా కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టడం అవాస్తవం

Helicopter Crash | బస్సు ప్రమాదాన్ని కవర్ చేసేందుకు వెళ్లి.. కూలిపోయిన మీడియా హెలికాప్టర్

Jio | జియో యూజర్లకు గుడ్‌న్యూస్.. ఏడాది పాటు కాన్వా ప్రొ ఉచితం..

Tummala Nageswara Rao | ఆయిల్‌పామ్‌కు సంబంధించి మార్కెటింగ్, ఎగుమతుల సమస్య లేదు: మంత్రి తుమ్మల



